‘నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి చిత్రాలను తెరకెక్కించి, దర్శకుడుగా తనదైన మార్క్‌తో ప్రతిభ చూపారు కిషోర్ తిరుమల. తాజాగా ఆయన ఓ ఉమెన్ సెంట్రిక్ స్టోరీని రెడీ చేస్తున్నారని, పురాణాలకు సంబంధించిన అంశాలు కూడా ఈ కథలో ఉంటాయని సమాచారం. ఈ సినిమాలోని లీడ్ రోల్‌కు సాయి పల్లవిని అనుకుంటున్నారని, ఆమెకు ఇటీవలే కిషోర్ కథ కూడా వినిపించారని తెలిసింది.
స్టోరీ లైన్ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు సాయి పల్లవి కూడా ప్రాథమికంగా అంగీకారం తెలిపారట. ఫుల్ స్క్రిప్ట్ పూర్తయ్యాక ఫైనల్ నరేషన్ విని, ఈ చిత్రం చేయడంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారట సాయి పల్లవి. మరోవైపు హిందీ ‘రామాయణ’లో సీతగా నటించారామె. తమిళంలో ధనుష్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.


