ఓటీటీలోకి తమిళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Blast Movie OTT Streaming Latest Update | Sakshi
Sakshi News home page

Blast OTT: ఇంట్లో అందరూ కరాటే మాస్టర్లే.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Jun 20 2026 3:36 PM | Updated on Jun 20 2026 3:40 PM

Blast Movie OTT Streaming Latest Update

అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఓ తమిళ యాక్షన్ మూవీ సొంత భాషతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ‘బాలన్‌- ది బాయ్‌’ మూవీ రివ్యూ)

యాక్షన్ హీరో అర్జున్, అభిరామి, ప్రీతిముకుందన్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'బ్లాస్ట్'. తెలుగులో 'బ్లాస్ట్ జోన్' పేరుతో రిలీజ్ చేశారు. ఓ మాదిరి అంచనాలతోనే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. తమిళ, తెలుగులో హిట్ అనిపించుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే గురువారం(జూన్ 25) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్) మిడిల్ క్లాస్ అమ్మాయి. తల్లిదండ్రులు(అర్జున్, అభిరామి)తో కలిసి ఉంటుంది. వీళ్లంతా కరాటే మాస్టర్లే. నీల తండ్రి ఓవైపు మెడికల్ షాప్ నడుపుతూనే మరోవైపు పిల్లలకు ఫ్రీగా కరాటే నేర్పిస్తుంటాడు. నీల ఓ రోజు షాపులో ఉండగా కృపాకర్ గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ వచ్చి ఈమెని బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే నీల చేతిలో చావుదెబ్బలు తిని జైలుపాలవుతాడు. దీంతో కృపాకర్‌ గ్యాంగ్‌తో పాటు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అబ్రహం (అర్జున్‌ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. తర్వాత ఏమైంది? అసలు కృపాకర్‌ గ్యాంగ్‌.. నీల కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు ‍కలెక్షన్స్ ఎన్నికోట్లు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement