మళ్లీ లవ్‌ అండ్‌ వార్‌ | Ranbir Kapoor Resumes 'Love and War' Final Schedule in Mumbai Before 'Ramayana' | Sakshi
Sakshi News home page

మళ్లీ లవ్‌ అండ్‌ వార్‌

Aug 5 2026 1:21 AM | Updated on Aug 5 2026 9:39 AM

Ranbir Kapoor takes a break from Ramayana to resume Love and War shoot

విక్కీ, ఆలియా, సంజయ్‌ లీలా భన్సాలీ, రణ్‌బీర్‌

కొంత విరామం తర్వాత ముంబైలో మళ్లీ ‘లవ్‌ అండ్‌ వార్‌’ మొదలు పెట్టారట రణ్‌బీర్‌ కపూర్‌. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్‌ నటిస్తున్న సినిమా ‘లవ్‌ అండ్‌ వార్‌’. ఈ పీరియాడికల్‌ ట్రయాంగిల్‌ యాక్షన్‌ లవ్‌స్టోరీ చిత్రంలో రణ్‌బీర్, విక్కీ భారత సైనికుల పాత్రలు చేస్తున్నారని సమాచారం. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ముంబైలోని రాయల్‌ పామ్స్‌ లొకేషన్స్‌లో ప్రారంభమైందని తెలిసింది.

ఈ సినిమాకు ఇదే ఫైనల్‌ షెడ్యూల్‌ అని, ఈ షూట్‌లో రెండు భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరించేలా భన్సాలీ ప్లాన్‌ చేశారని టాక్‌. వార్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణలో దాదాపు 50 మంది ఫైటర్స్, దాదాపు 300 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొంటారట.

ఈ సినిమాను ఆగస్టు కల్లా పూర్తి చేయాలని భన్సాలీ టార్గెట్‌గా పెట్టుకున్నారట. నిజానికి ఈ చిత్రాన్ని గత ఏడాది డిసెంబరులో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్‌ సజావుగా సాగక పోవడం, మరోవైపు ‘రామాయణ’ చిత్రంతో రణ్‌బీర్‌ బిజీగా ఉండటంతో ‘లవ్‌ అండ్‌ వార్‌’ ఆలస్యమైందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 21న రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement