హిందీ మూవీతో రావత్ ఎంట్రీ.. చివరి సినిమా ఇదే..! | Pradeep Rawat Passed Away: 'Gaayapadda Simham' Marks His Final On-Screen Appearance | Sakshi
Sakshi News home page

Pradeep Rawat: హిందీ మూవీతో ఎంట్రీ.. రావత్ చివరి చిత్రమిదే..!

Aug 4 2026 10:13 PM | Updated on Aug 5 2026 9:38 AM

Pradeep Rawat Last Movie Name Goes After His Demise

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ముంబయిలోని ఓ  ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతితో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

తెలుగులోనే ఎక్కువగా ఫేమస్..

హిందీ మూవీ బాఘితో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత  నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్‌షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్‌, నాయక్‌, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు.  తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు. ఈ సినిమాలో భిక్షు దాస్ పాత్రలో కనిపించారు. ఇదే ఆయన చివరి సినిమా కావడం విశేషం. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement