బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత ఫేమస్ వారిలో తనూజ ఒకరు. బిగ్‌బాస్ తెలుగు సీజన్- 9లో ఆమె రన్నరప్‌గా నిలిచారు. తాజాగా ఈ బ్యూటీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. తనూజ లీడ్ రోల్‌లో సరికొత్త వెబ్ సిరీస్ రానుంది. పార్ట్ టైమర్స్ పేరుతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు.
ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్ ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. జియో హాట్‌స్టార్ వేదికగా ఈ వెబ్ సిరీస్ సినీ ప్రియులను అలరించనుంది. ఈ సిరీస్‌లో తనూజతో పాటు జ్ఞానేశ్వరి కాండ్రేగుల కీలక పాత్రలో కనిపించనుంది. 30 ఏళ్లలోపే బిజినెస్‌లో సక్సెస్ కావాలని ఇద్దరు యువతుల కథగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది.


