ఓటీటీలో క్రేజీ సైకలాజికల్ హారర్ సినిమా | Backrooms OTT Release Date India: Sci-Fi Horror Film Coming Soon on Sony LIV | Sakshi
Sakshi News home page

Backrooms OTT: మతిపోయే కాన్సెప్ట్.. దెయ్యమే లేని హారర్ మూవీ

Aug 4 2026 3:20 PM | Updated on Aug 4 2026 3:25 PM

Backrooms Movie OTT Release Date India

ఎప్పుడూ రెగ్యులర్ కామెడీ, థ్రిల్లర్స్ కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ సినిమాలు కూడా వస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే ఇది. దెయ్యమే ఉండదు కానీ భయపెడుతుంది. సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ హారర్ కాన్సెప్ట్‌తో తీశారు. థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

కొన్ని నెలల క్రితం వచ్చిన 'అబ్సెషన్' ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని తీసింది ఓ యూట్యూబర్. అలానే అమెరికాకు చెందిన 21 ఏళ్ల మరో యూట్యూబర్ కేన్ పర్సన్సో తీసిన సైకలాజికల్ హారర్ మూవీ 'బ్యాక్ రూమ్స్'. విదేశాల్లో మే నెల చివరలో థియేటర్లలో రిలీజ్ కాగా మన దగ్గర జూన్ 12న విడుదలైంది. ప్రేక్షకులని భయపెడుతూనే చిత్రమైన అనుభూతినిచ్చింది. ఇప్పుడీ చిత్రాన్ని సోనీ లివ్ ఓటీటీలో ఈ నెలలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తేదీ చెప్పలేదు. అయితే ఈనెల 14న లేదంటే 21న అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

'బ్యాక్ రూమ్స్' విషయానికొస్తే.. క్లార్క్ (ఎజియోఫర్) ఓ ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తుంటాడు. ఓ రోజు ఇదే షాపులో దిగువన ఉండే ఓ రహస్య ప్రదేశంలోకి అనుకోకుండా వెళ్తాడు. మొత్తం పసుపు రంగులోనే ఉన్న అంతులేని ఖాళీ గదులు దర్శనమిస్తాయి. ఆ వింత ప్రదేశం నుండి బయటపడే క్రమంలో ఊహించని ప్రమాదాలు, విచిత్రమైన శబ్దాలు, భయపెట్టే అనుభవాలు ఎదురవుతాయి. ఇంతకీ ఈ ఖాళీ గదుల సంగతేంటి? దీని నుంచి క్లార్క్ ఎలా బయటపడ్డాడు అనేది మిగతా స్టోరీ.

ఈ మూవీ రెగ్యులర్ చిత్రాలతో పోలిస్తే సరికొత్త అనుభూతి కలిగిస్తుంది. దెయ్యం లాంటివి ఏం లేనప్పటికీ హారర్ ఫీల్ తీసుకురాగలిగింది. పసుపు గదుల సెటప్ అయితే భయపెట్టేలా ఉంటుంది. అసలు ఇదంతా ఎలా డిజైన్ చేశారా అని సందేహం కలుగుతుంది. మరి ఓటీటీలో ఇంగ్లీష్ వెర్షనే రిలీజ్ చేస్తారా? తెలుగులోనూ డబ్బింగ్ చేసి తీసుకొస్తారా అనేది చూడాలి? ఇదివరకే ఇది అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది గానీ అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది!

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement