రిలయన్స్ జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సరికొత్త జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ అండ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లు హై-స్పీడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌లను ఒకే ప్యాకేజీలో నెలకు రూ. 400 ప్రారంభ ధరతో అందిస్తున్నాయి.
ఈ బండిల్ ఆఫర్ ద్వారా కస్టమర్‌లు బ్రాడ్‌బ్యాండ్, టెలివిజన్ మరియు స్ట్రీమింగ్ వినోదాన్ని ఒకే కనెక్షన్ మరియు ఒకే నెలవారీ బిల్లుతో పొందవచ్చు. కేవలం టీవీ మాత్రమే చూసే వారి నుంచి హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు లైవ్ టీవీ, ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి వరకు, వివిధ రకాల గృహ అవసరాలకు సరిపోయేలా ఈ ప్లాన్‌లు రూపొందించారు.
ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి, కస్టమర్‌లు అన్‌లిమిటెడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, 200కి పైగా HD ఛానెల్‌లు.. ఆహా, జియోహాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ వంటి వాటితో సహా 12-ప్లస్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్‌ను ఆస్వాదించవచ్చు. ఇందులో టీవీలో యూట్యూబ్, జియో సర్వీస్ ఇంజనీర్ల ద్వారా ఉచిత ఇన్‌స్టాలేషన్.. మెయింటెనెన్స్, అలాగే లైవ్ టీవీని ప్లే, పాజ్ & రివైండ్ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గృహాలకు.. జియో హోమ్ తన ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా టెలివిజన్ సేవలను అందిస్తుంది. సాధారణంగా వాతావరణం బాగాలేనప్పుడు డీటీహెచ్ సేవలకు అంతరాయం కలుగుతుంది, కానీ ఫైబర్ ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనైనా అంతరాయం లేని వీక్షణ అనుభవాన్ని జియో అందిస్తుంది. కస్టమర్‌లు లైవ్ టీవీని పాజ్ మరియు రివైండ్ చేయగల సదుపాయం ఉన్నందున, వారు తమకు ఇష్టమైన తెలుగు సీరియల్స్, సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ లేదా న్యూస్ ప్రోగ్రామ్‌లను ఎప్పటికీ మిస్ అయ్యే అవకాశం లేదు.


