బీమా పంపిణీ సంస్థ ఐఐఆర్‌ఎం హోల్డింగ్స్ ఇండియా రూ. 150 కోట్ల నిధులను సమకూర్చుకుంటున్నట్లు తెలిపింది. కార్పెడియం క్యాపిటల్, సాన్షి ఫండ్-1 లీడ్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొంది.
ఒక్కో షేరుకు రూ. 143.28 ధర చొప్పున ఫుల్లీ కన్వర్టబుల్ వారంట్లు, షేర్ల జారీ ద్వారా నిధులను సమీకరిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ వి. రామకృష్ణ చెప్పారు. ఈ మొత్తాన్ని వ్యాపార విస్తరణ, కొనుగోళ్లు, వర్కింగ్ క్యాపిటల్ మొదలైన అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు వివరించారు. సింగపూర్, శ్రీలంక తదితర దేశాల్లో కూడా కార్యకలాపాలు సాగిస్తున్న ఐఐఆర్‌ఎం హోల్డింగ్స్‌కి 18 కార్యాలయాలు ఉన్నాయి. 2,000 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లు, 500 మంది సిబ్బంది ఉన్నారు.


