Vodafone Idea: రూ.లక్ష కోట్లు సమీకరణపై ఆశలు | Vodafone Idea Eyes Rs 1 Lakh Crore Funding Over Next Three Years | Sakshi
Sakshi News home page

Vodafone Idea: రూ.లక్ష కోట్లు సమీకరణపై ఆశలు

May 19 2026 8:08 PM | Updated on May 19 2026 8:26 PM

Vodafone Idea Eyes Rs 1 Lakh Crore Funding Over Next Three Years

వచ్చే మూడేళ్లలో అవసరమయ్యే రూ. 1 లక్ష కోట్లను సమకూర్చుకునేందుకు కొత్త రుణాలు, ట్యాక్స్‌ రిఫండ్‌లు, ప్రమోటర్ల నుంచి మరిన్ని పెట్టుబడులపై టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (వీఐ) భారీగా ఆశలు పెట్టుకుంది. మార్కెట్లో నిలబడే దిశగా నెట్‌వర్క్‌ని మెరుగుపర్చుకునేందుకు కంపెనీ దాదాపు రూ. 45,000 కోట్లు వెచ్చించనుంది. అలాగే, వచ్చే మూడేళ్లలో స్పెక్ట్రం చార్జీల కింద సంస్థ రూ. 49,000 కోట్లు, రుణభారానికి సంబంధించిన వడ్డీల కోసం మరో రూ. 5,000-6,000 కోట్లు చెల్లించాల్సి రానుంది.

అయితే.. మరింత రుణాన్ని ఈక్విటీ కింద మార్చాల్సిన అవసరం లేకుండానే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వీఐ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ తేజస్‌ మెహతా తెలిపారు. తాము రూ. 25,000 కోట్ల నిధులతో పాటు మూడేళ్ల వ్యవధిలో రూ. 60,000 కోట్ల వరకు ఎబిటాను సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఇక ట్యాక్స్‌ రిఫండ్‌ కింద మరో రూ. 10,000 కోట్లు రావాల్సి ఉంటుందని వివరించారు.

కొత్త ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్యాకేజీలు..
పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్ల కోసం కొత్తగా మరిన్ని ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్యాకేజీలను ఆవిష్కరించినట్లు వీఐ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అవనీష్‌ ఖోస్లా తెలిపారు. ఇవి 7 రోజులు, 14 రోజులు, 21 రోజుల కాలవ్యవధితో లభిస్తాయని వివరించారు. దీనితో మొత్తం 1 రోజు నుంచి 30 రోజుల వరకు వేలిడిటీతో 17 రకాల ప్యాక్‌లను అందిస్తున్నట్లవుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement