వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో భారీ హిట్ అందుకున్న చిరు.. బాబీతో మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో టాక్ వైరలవుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేయనున్నారని నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాకుండా ఈ మూవీలో తండ్రీ, కొడుకు పాత్రలు చేయనున్నారంటూ వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ క్రేజ్ దృష్ట్యా ఈ తరహా రోల్స్ చేయడం లేదనే ఇన్‌సైడ్ టాక్. దీంతో ఈ రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రంజన్.. చిరు కూతురి పాత్రలో కనిపించనుంది. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు.


