త్రిషపై వివాదాస్పద కామెంట్స్.. నెట్టింట పాత వీడియోలు ట్రెండింగ్..! | Udhayanidhi Stalin-Trisha Controversy: Old 'Kuruvi' Videos with Vijay Go Viral | Sakshi
Sakshi News home page

Trisha controversey: కోలీవుడ్‌లో వివాదం.. ఓకే వేదికపై విజయ్, త్రిష, ఉదయనిధి..!

Aug 4 2026 9:09 PM | Updated on Aug 4 2026 9:18 PM

udayanidhi and trisha controversey old videos with Vijay Trending now

కోలీవుడ్‌లో త్రిష పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేయగా బెయిల్‌పై విడుదలయ్యారు. ఇదే ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు తమిళనాడు షేక్ చేస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో పాత వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. రాజకీయాల్లోకి రాకముందు విజయ్, ఉదయ్‌నిధి స్టాలిన్ పలు వేదికలపై మెరిశారు. పలు సినిమా సక్సెస్ ‍ఈవెంట్లకు హాజరయ్యారు. ఈ వివాదం నేపథ్యంలో గతంలో విజయ్‌తో ఉన్న స్టాలిన్‌ ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి.

2008లో వచ్చిన 'కురువి' చిత్రంలో విజయ్, త్రిష జంటగా నటించారు. ఈ మూవీ ఆడియో రిలీజ్‌తో పాటు150 రోజుల విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విజయ్, స్టాలిన్‌, త్రిష ఓకే వేదికపై సందడి చేశారు. దీనికి సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అప్పట్లో ముగ్గురూ ఒకే వేదికపై ఉన్న వీళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే ట్రెండింగ్ టాపిక్. 

కాగా.. కురువి చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ మూవీకి నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించారు. ఈ సినిమాలో భాగమైనందుకు విజయ్, త్రిషలకు ఉదయనిధి కృతజ్ఞతలు తెలిపారు. కథానాయికగా ఎంపికైనందుకు త్రిషకు కృతజ్ఞతలు చెప్పారు. అప్పట్లో ఓకే వేదికపై విజయ్, త్రిష, ఉదయనిధిల మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు ‍ట్రెండింగ్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement