టాలీవుడ్‌లో సినిమా టికెట్ల పంచాయితీ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రేట్లు, పర్సంటేజ్ విషయంలో వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని ఆశించారు. కానీ తాజాగా ఆ కమిటీని ఫిల్మ్ ఛాంబర్ రద్దు చేసింది. దీంతో ఈ వివాదం మళ్లీ మొదటికొచ్చింది.
తాజాగా నిర్మాత కె ఎల్ నారాయణ అధ్యక్షతన మరో 9 మందితో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. టికెట్ రేట్లు , పర్సెంటేజ్ విధి విధానాలపై చర్చించిన ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది. పాత కమిటీని పూర్తిగా రద్దు చేసిన ఫిల్మ్ ఛాంబర్.. కమిటీ రిపోర్ట్‌కు ఎలాంటి కాల పరిమితి లేదని ప్రకటించింది. ఈ కొత్త కమిటీతోనైనా ఈ వివాదానికి పరిష్కారం లభిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.


