breaking news
Pradeep Rawat
-
ఛత్రపతి విలన్ ప్రదీప్ రావత్ బయోగ్రఫీ
-
కళ్లముందే నాన్న ప్రాణాలు వదిలారు.. ప్రదీప్ రావత్ కొడుకు ఎమోషనల్
‘సై’తో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా మెప్పించిన నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 74 ఏళ్ల వయసులో బ్లడ్ క్యాన్సర్ కారణంగా ఆయన మృతి చెందాడు. అయితే చివరి రోజుల్లో ఆయన అనుభవించిన బాధను, ఆఖరి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆయన కుమారుడు విక్రమాదిత్య ఎమోషనల్ అయ్యాడు. అంత్యక్రియలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాడు. ‘రెండు నెలల క్రితం నాన్న ఆరోగ్యంగానే ఉన్నాడు. అన్నీ పరీక్షలు చేయించాం. రిపోర్టులు అన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఈ మధ్యే అమ్మ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నాన్నకు ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లాం. తొలుత కడుపులో సాధారణ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనుకున్నాం. అయినా సరే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్లో చూపించి..ఇంటికి తీసుకొచ్చాం. మళ్లీ ఓ రోజు అమ్మ ఫోన్ చేసి ఆరోగ్యం బాగా క్షీణించిందని చెప్పింది. దీంతో బ్లడ్ టెస్ట్ చేయించాం. తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. వెంటనే కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించాం. అప్పుడే బ్లడ్ క్యాన్సర్ అని బయటపడింది.ఈ విషయం తెలియగానే అమ్మతో పాటు అందరం షాకయ్యాం. రెండు నెలల క్రితం ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పడంతో కుప్పకూలిపోయాం. నెలన్నర వ్యవధిలోనే నాన్న మమ్మల్ని వదిలివెళ్లిపోయాడు. చనిపోయే కొద్ది క్షణాల ముందు డాక్టర్ మమల్ని పిలిచాడు. అప్పటికే నాన్నకు వైద్యులు సీపీఆర్ చేస్తున్నారు. నాన్నను అలా చూడగానే ఆశలు లేవని నాకు అర్థమైపోయింది. అవే అఖరి క్షణాలని తెలిసి అమ్మ గట్టిగా ఏడ్చేసింది. చూస్తుండగానే నాన్న ప్రాణాలు వదిలేశాడు’ అంటూ విక్రమాదిత్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. -
ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్..(ఫొటోలు)
-
ప్రదీప్ రావత్ మరణం.. అసలు టాలీవుడ్‌కు ఏమైంది?
సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం చెందారు. గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ సాయంత్రం కన్నుమూశారు ముంబయిలోని గోరెగావ్‌లో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, రాజ్ అర్జున్, కరణ్ వి గ్రోవర్, సురేంద్ర పాల్, రుహానికా ధావన్ తదితరులు ఉన్నారు. అంత్యక్రియల సమయంలో రావత్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.స్పందించని టాలీవుడ్..బాలీవుడ్ కంటే తెలుగు సినిమాల్లో ఎక్కువగా మెప్పించిన ప్రదీప్ రావత్‌పై టాలీవుడ్ చిన్నచూపు చూసింది. ఆయన మరణం తర్వాత ఏ ఒక్క హీరో సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించలేదు. కేవలం మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రమే ఆయనను గుర్తు చేసుకున్నారు. ప్రదీప్ రావత్ లేరన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఆయనకు నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. మంచు విష్ణు సంతాపం.. మంచు విష్ణు తన ట్వీట్లో రాస్తూ..'ప్రదీప్ రావత్ మరణవార్త విని చాలా బాధపడ్డా. తెరపై, ఆయన పోషించిన ప్రతి పాత్రకు అపారమైన శక్తిని తీసుకొచ్చారు. కానీ తెర వెనుక, ఆయన దానికి పూర్తి విరుద్ధం. ఎంతో వినయశీలి, నిరాడంబరుడు, ఆప్యాయత గలవారు. ఎంతో ఒదిగి ఉండే వ్యక్తి. నేను ఆయనను ఎల్లప్పుడూ అలాగే గుర్తుంచుకుంటాను. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఇదే నా హృదయపూర్వక సంతాపం. ఈ కష్ట సమయంలో భగవంతుడు వారికి శక్తిని ప్రసాదించాలని, ఆయన పవిత్రాత్మ శాశ్వత శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. హిందీ మూవీ బాఘితో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు. It is deeply saddening to hear of the passing of Pradeep Rawat garu.On screen, he brought immense power to every character he portrayed. Off screen, he was the complete opposite: humble, simple, warm, and truly down to earth. That is how I will always remember him.My…— Vishnu Manchu (@iVishnuManchu) August 5, 2026 -
ఆ కారణంగానే గజినీ నటుడు ప్రదీప్ రావత్ ప్రాణం..వృద్ధాప్యంలో ఆ సమస్య తప్పదా?
గజని పలు బ్లాక్‌బస్టర్ మూవీలలో విలన్‌గా తన మార్కుతో మెప్పించి ప్రశంసలందుకున్న నటుడు ప్రదీప్ రావత్ కేన్సర్ చికిత్స పొందుతూ మరణించారు. మంచి నటుడి పేరుతెచ్చుకున్న రావత్ 74 ఏళ్ల వయసులో కేన్సర్ కారణంగా మృతి చెందినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇక్కడ ఈ నటుడి మరణంగా కీలకమైన ఆరోగ్య ప్రశ్నను లేవనెత్తింది. కేవలం వయసు పెరగడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా?, తప్పనిసరిగా వృద్ధాప్యంలో కేన్సర్ వస్తుందా అంటే..వయసు పెరగడం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం కచ్చితంగా పెరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగని వృద్ధాప్యంలో కేన్సర్ అనివార్యమని చెప్పలేమని అన్నారు. జీవితాంతం మన శరీరంలోని కణాలు నిరంతరం విభజన చెందుతూ, తమను తాము బాగు చేసుకుంటాయని చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ మన కణాలకు జన్యుపరమైన హాని జరగడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. మన శరీరం దెబ్బతిన్న DNAను రోజూ బాగు చేసుకున్నప్పటికీ, ఈ ప్రక్రియలు చివరికి వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అదే సమయంలో అదే సమయంలో, మన రోగనిరోధక వ్యవస్థ అసాధారణ కణాలు కేన్సర్‌గా మారకముందే వాటిని గుర్తించి నాశనం చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా దశాబ్దాలుగా ఈ జన్యుపరమైన మార్పులు పేరుకుపోవడంతో, అసాధారణ కణాలు వృద్ధి చెంది కేన్సర్‌గా మారే అవకాశాలు క్రమంగా పెరుగుతాయని అంటున్నారు. అలాగే ఒక వయసు గల ప్రతి ఒక్కరికీ కేన్సర్ వచ్చే ప్రమాదం ఒకేలా ఉంటుందని అపోహ పడుతుంటారు. జీవసంబంధమైన వృద్ధాప్యం, కాలక్రమేణా వచ్చే వృద్ధాప్యానికి భిన్నంగా ఉంటుందని నొక్కి చెబుతున్నారు. జీవనశైలి, కుటుంబ చరిత్ర, శారీరక శ్రమ స్థాయి, నిద్ర నాణ్యత, సాధారణ జీవక్రియ ఆరోగ్యంపై ఆధారపడి, 74 ఏళ్ల వయస్సు గల ఏ ఇద్దరు వ్యక్తులకు కేన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ..క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారికి ఈ సమస్య తక్కువ. అలాకాకుండా అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు ఉంటే కచ్చితం ఈ కేన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువని చెబుతున్నారు. వృద్ధుల్లో ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడానికి రీజన్..వృద్ధులలో కేన్సర్ ఆలస్యంగా నిర్ధారణ కావడానికి గల అతిపెద్ద కారణాలలో ఒకటి, లక్షణాలను తరచుగా వృద్ధాప్యంలో సాధారణమైనవిగా కొట్టిపారేయడమేనని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నిరంతరం బరువు తగ్గడం, అసాధారణమైన అలసట, మూత్రంలో లేదా మలంలో రక్తం, తగ్గని గడ్డ, మింగడంలో ఇబ్బంది, లేదా మూడు వారాల కంటే ఎక్కువ కాలం ఉండే దగ్గు వంటి లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఇవే కాకుండా కనిపించే ఇతర లక్షణాలు..మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులుకారణం తెలియని రక్తస్రావంచర్మంపై కొత్త మార్పులునిరంతరం గొంతు బొంగురుపోవడంఆకలి లేకపోవడంరాత్రిపూట చెమటలు పట్టడంఈ లక్షణాలు ఎల్లప్పుడూ కేన్సర్‌ను సూచించనప్పటికీ, ఈ లక్షణాలతో ముందస్తు వైద్య పరీక్షల్లో ఆ వ్యాధిని ముందుగా గుర్తించి సులభంగా బయటపడగలుగుతారని అంటున్నారు. చాలా కేన్సర్లు ప్రారంభ దశలో గుర్తిస్తే..సులభంగా చికిత్స చేయవచ్చు. ముఖ్యంగా స్క్రీనింగ్ వంటి వైద్య పరీక్షలను, సకాలంలో చేస్తే.. లక్షణాలు కనిపించకముందే కొన్ని రకాల కేన్సర్లను ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు.అలాగే చాలామంది డెబ్బై, ఎనభై ఏళ్ల వరకు జీవిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ కేన్సర్ సర్వసాధారణం అయినప్పటికీ..వృద్ధాప్యాన్ని అనివార్య పరిణామంగా పరిగణించకూడదని నిపుణులు నొక్కి చెబుతున్నారు. అందుకే మంచి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేలా కేర్ తీసుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్ ఏఐ డైరెక్టర్ ..) -
ముగిసిన ప్రదీప్ రావత్ అంత్యక్రియలు.. సినీ ప్రముఖుల నివాళులు
సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని గోరెగావ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, రాజ్ అర్జున్, కరణ్ వి గ్రోవర్, సురేంద్ర పాల్, రుహానికా ధావన్ తదితరులు ఉన్నారు. అంత్యక్రియల సమయంలో రావత్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.కాగా..గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. భివండిలోని ఒక ఆసుపత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన మరణాన్ని 'లగాన్' సహనటుడు యశ్పాల్ శర్మ ధృవీకరించారు. ప్రదీప్ మృతి పట్ల అఖిల భారత సినీ కార్మికుల సంఘం సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.రావత్ కెరీర్..కాగా.. హిందీ మూవీ బాఘితో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు. -
ప్రదీప్ రావత్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రల్లో మెప్పించిన ప్రదీప్ రావత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముంబయిలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. ఆయనతో నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు.కాగా.. హిందీ మూవీ బాఘితో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు.ఆయన మరణం వేళ ఓ ఆసక్తకర విషయంపై చర్చ నడుస్తోంది. ప్రదీప్ తన కెరీర్లో ఎంత సంపాదించారని నెట్టింట వెతికేస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన ఆయన ఆస్తి ఎంతనేదానిపై పలు నివేదికలు ప్రచురించాయి. ఆయన ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.20 నుంచి 40 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. వీటిలో స్థిర, చరాస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటి గురించి ఎలాంటి అధికారిక సమాచారమైతే లేదు. ప్రదీప్ దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించి బాగానే సంపాదించారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.ప్రదీప్ తన కెరీర్లో ఎన్నో గొప్ప పాత్రలు పోషించినప్పటికీ.. ఆమిర్ ఖాన్ సరసన పోషించిన గజినీ ధర్మాత్మ పాత్ర ఆయన కెరీర్లో అత్యంత గుర్తింపు తీసుకొచ్చింది. ఈ చిత్రం బాలీవుడ్లో రూ.100 కోట్లు సాధించి.. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా లగాన్, సర్ఫరోష్, కోయ్లా, మేజర్ సాబ్, సయే, స్టాలిన్, వీరం, జిల్లా, వాల్తేర్ వీరయ్య, టైగర్ నాగేశ్వరరావు, ఛావా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కాగా.. రావత్‌కు భార్య కళ్యాణి రావత్, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. -
టాలీవుడ్‌కు షాక్.. విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత
-
ఇది తెలుసా? ప్రదీప్ రావత్ తెలుగింటి అల్లుడే
టాలీవుడ్ విలన్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్(74) చనిపోయారు. గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన మంగళవారం సాయంత్రం ముంబైలో తుదిశ్వాస విడిచారు. పలు భాషల్లో 150కి పైగా సినిమాలు చేసిన ఈయనకు ఆంధ్రాతో సంబంధముంది. అవును ఈయన తెలుగింటి అల్లుడు అనే సంగతి చాలామందికి తెలీదు. ఈ విషయాన్ని గతంలో ఈయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(ఇదీ చదవండి: భర్త కోసం 26 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఆ హీరోయిన్)ప్రదీప్ రావత్ భార్య పేరు కల్యాణి. ఈమెది కాకినాడ. 'స్టాలిన్' షూటింగ్ టైంలో మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. వీళ్లకు విక్రమ్, సింగ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. బయట ప్రదీప్ రావత్-కల్యాణి.. లో ప్రొఫైల్ మెంటైన్ చేస్తుంటారు. తన భర్తది చాలా సున్నితమైన మనసు అని గతంలో ఓసారి కల్యాణి చెప్పారు. కల్యాణికి కూడా సినీ రంగంతో అనుబంధం ఉందమున్నట్లు తెలుస్తోంది. మోడలింగ్‌లో కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. పలు కమర్షియల్ యాడ్స్, హిందీ సీరియల్స్‌లో నటించారట.ప్రదీప్ రావత్ కెరీర్ విషయానికొస్తే.. 1985లో నటుడిగా పరిచయమయ్యారు. తొలుత సీరియల్స్ చేశారు. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్ టీవీ సీరియల్లో అశ్వత్థామ పాత్రలో నటించారు. ఆమిర్ ఖాన్ లగాన్లోనూ కీలక పాత్ర చేశారు. 2004లో రాజమౌళి తీసిన 'సై'తో తెలుగులోకి వచ్చారు. ఇందులో ఇతడు చేసిన భిక్షు యాదవ్ పాత్ర బాగా హైలెట్ అయ్యింది. తర్వాత భద్ర, అందరివాడు, ఛత్రపతి, లక్ష్మీ, స్టాలిన్, దేశముదురు, యోగి, గజినీ, మస్కా, రగడ, రాజన్న, రెబల్, నాయక్, నేనొక్కడినే, లయన్, సరైనోడు, నేను శైలజ, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, నేనే రాజు నేనే మంత్రి, జై లవకుశ, ఆడాళ్లు మీకు జోహార్లు, వాల్తేర్ వీరయ్య చేశారు. చివరగా ఈ ఏడాది మేలో వచ్చిన 'గాయపడ్డ సింహం'లో కనిపించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
భిక్షు యాదవ్, రాస్ బిహారీ.. ప్రదీప్ రావత్‌లోని మరో కోణం ఇది (ఫొటోలు)
-
సినీ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత
-
హిందీ మూవీతో రావత్ ఎంట్రీ.. చివరి సినిమా ఇదే..!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతితో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగులోనే ఎక్కువగా ఫేమస్..హిందీ మూవీ బాఘితో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు. ఈ సినిమాలో భిక్షు దాస్ పాత్రలో కనిపించారు. ఇదే ఆయన చివరి సినిమా కావడం విశేషం. -
సినీ పరిశ్రమలో విషాదం.. ఛత్రపతి విలన్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్(74) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన క్యాన్సర్‌తోనూ పోరాడుతున్నారు. చివరికీ ఇవాళ ఇలా కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జనవరి 21, 1952లో జన్మించిన ప్రదీప్ రావత్.. సినీ ఇండస్ట్రీలో విలన్‌గా మెప్పించారు. కామెడీ పాత్రలతో పాటు విలన్‌గానే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్లో నితిన్ హీరోగా వచ్చిన సై మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాస్ ఛత్రపతిలో రాజ్ బిహారి పాత్రలో విలన్‌గా ఆకట్టుకున్నారు. అంతే కాకుండా సూర్య హీరోగా వచ్చిన గజిని మూవీలో విలన్‌గా రాణించారు. ఈ ఏడాదిలో ఇటీవలే రిలీజైన గాయపడ్డ సింహం చిత్రంలో చివరిసారిగా కనిపించారు.బాఘీతో ఎంట్రీ..హిందీలో బాఘీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో ప్రతినాయక సహాయ పాత్రలతో మరింత గుర్తింపు పొందారు. బి.ఆర్. చోప్రా తెరకెక్కించిన ప్రసిద్ధ టీవీ ధారావాహిక మహాభారత్‌లో అశ్వత్థామ పాత్ర పోషించారు. సై సినిమాకు విలన్‌గా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. తెలుగులో లక్ష్మీ, స్టాలిన్, నాయక్, 1: నేనొక్కడినే', సరైనోడు, భద్ర, యోగి, దేశముదురు, అందరివాడు, స్టాలిన్, లగాన్, గజిని లాంటి చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, వీర, అల్లుడు శీను, లయన్, రగడ, బలాదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో మెప్పించారు. -
డ్రైవర్ రాముడు టీజర్
డ్రైవర్ రాముడు ఈ పేరు వింటే వెంటనే గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారకరామారావు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో వన్ ఆఫ్ ది కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రూపొందుతోంది. కమెడియన్ ‘షకలక’ శంకర్‌ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు రాజ్ సత్య డ్రైవర్ రాముడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హీరో సుధీర్ బాబు చేతుల మీదుగా లాంఛ్ చేయించారు. ప్రదీప్‌సింగ్ రావత్‌కి శంకర్ మధ్య జరిగే సరదా డైలాగులతో టీజర్‌ను చూపించారు. సునీల్ కశ్యప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. శంకర్ మార్క్ కామెడీతోపాటు ఎమోషనల్గానూ కథ ఉంటుందని మేకర్లు చెబుతున్నారు. అంచల్ సింగ్ శంకర్‌కు జోడీగా నటిస్తోంది. ఎమ్.ఎల్. రాజు, ఎస్.ఆర్. కిషన్ నిర్మిస్తున్న డ్రైవర్ రాముడు త్వరలోనే విడుదల కానుంది. -
‘షకలక’ శంకర్ డ్రైవర్ రాముడు టీజర్ విడుదల
-
గ్యాంగ్ వార్
‘మంగళ’, ‘క్రిమినల్స్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న మరో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వెపన్’. అవినాష్, ప్రదీప్ రావత్, రాజారాయ్, రాజు, మధుబాబు ప్రధాన పాత్రల్లో ఆర్.ఎస్.సురేష్ దర్శకత్వంలో శర్మ చుక్కా నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ మార్చి 20న మొదలవుతుంది. శర్మ చుక్కా మాట్లాడుతూ– ‘‘రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. టైటిల్‌కి పూర్తి జస్టిఫికేషన్ ఇచ్చే కథాంశంతో మా సినిమా ఉంటుంది. మా బ్యానర్లో వచ్చిన ‘మంగళ, క్రిమినల్స్’ చిత్రాల కంటే ‘వెపన్’ మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సబ్బారపు ప్రకాష్. -
స్క్రీన్ టెస్ట్
► నటుడు ప్రదీప్ రావత్ ఏ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు? ఎ) ఛత్రపతి బి) అందరివాడుసి ) సై డి) భద్ర ► దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ సినిమా తీయకముందు షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించారు. ఏ షార్ట్‌ఫిల్మ్ అతనికి మంచి పేరు తెచ్చిందో తెలుసా? ఎ) సైన్మా బి) అతిథి సి) లోకల్ బోయ్ డి) రైతుబిడ్డ ► భానుమతిని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో కనుక్కోండి. ఎ) కమలాకర కామేశ్వరరావు బి) సి.పుల్లయ్య సి) పి. పుల్లయ్య డి) ఆదుర్తి సుబ్బారావు ► హీరో శర్వానంద్ సినిమాల్లోకి రాకముందు ఒక యాడ్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశారు. ఆ యాడ్‌లో ఓ టాప్ హీరో నటించారు. ఆ నటుడెవరో ఊహించండి? ఎ) చిరంజీవి బి) నాగార్జున సి) వెంకటేశ్ డి) మోహన్‌లాల్ ► ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువమంది ట్విట్టర్ ఫాలోయర్స్ ఉన్నది ఈ నటుని ఖాతాలోనే.. ఆయనెవరు? ఎ) అక్షయ్ కుమార్ బి) అమితాబ్ బచ్చన్ సి) సల్మాన్‌ఖాన్ డి) ఆమిర్‌ఖాన్ ► తన ఆరేళ్ల వయసులో..ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాట పాడారు. ఇప్పుడు ఆమె హీరోయిన్ కూడా. ఎవరో కనిపెట్టారా? ఎ) ‘కలర్స్’ స్వాతి బి) శ్రుతీహాసన్ సి) అమలాపాల్ డి) మమతా మోహన్‌దాస్ ► మొట్టమొదట కలర్లో (గేవా) పూర్తి నిడివితో వచ్చిన తెలుగు సినిమా ఏదో తెలుసా? ఎ) లవకుశ బి) ఆరాధనసి) అ మరశిల్పి జక్కన్న డి) పాతాళ భైరవి ► పుణ్యమూర్తులఅప్పలరాజు ఈయన అసలు పేరు. తెర పేరేంటో తెలుసా? ఎ) పద్మనాభం బి) రేలంగి సి) రాజనాల డి) రాజబాబు ► ‘ 7/జి బృందావన్ కాలనీ’ కన్నడ రీమేక్‌లో నటించిన ఈ బ్యూటీ ఇప్పడు తెలుగులో స్టార్ హీరోయిన్? ఆమె ఎవరో కనుక్కోండి? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) తమన్నా సి) రాశీఖన్నా డి) రెజీనా ► దీపావళి సినిమాలో‘నరకాసురుడు’ పాత్రను పోషించిన నటుడు గుర్తున్నారా? ఎ) యస్.వి. రంగారావు బి) కాంతారావు సి) చిత్తూరు నాగయ్య డి) కొంగర జగ్గయ్య ► తన మూడవ ఏట నుండే సంగీత శిక్షణ తీసుకున్న ఈ గాయని, తరువాతి కాలంలో గొప్ప పేరు సంపాదించారు. ఈమెను ‘నైటింగేల్ ఆఫ్ సౌత్’అని కూడా అంటారు.. ఆ నైటింగేల్ ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఎ) యస్.జానకి బి) పి.సుశీలసి) జమునారాణి డి) రావు బాలసరస్వతి ► రజనీకాంత్మాతృభాష ఏది? ఎ) కన్నడ బి) మలయాళం సి) తమిళ్ డి) మరాఠీ ► సీనియర్ యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన మొదటి చిత్రం? ఎ) యుగంధర్ బి) బొబ్బిలిపులి సి) రాముడు–భీముడు డి) కథానాయకుడు ► అలనాటి హాట్ డాన్సర్స్ జయమాలిని, జ్యోతిలక్ష్మిలకు బంధుత్వం ఉంది? వీళ్లు ఏమవుతారు? ఎ) అక్కాచెల్లెళ్లు బి) వదినా మరదలు సి) పిన్ని, కూతురు డి) తోడికోడళ్లు ► కృష్ణవంశీ–చిరంజీవి కాంబినేషన్లో అప్పట్లో ఒక సినిమా అనుకొని, దానికి పేరు కూడా పెట్టారు?ఆ సినిమా పేరేంటో తెలుసా? ఎ) జనగణమన బి) వందేమాతరం సి) స్వాతంత్య్ర భారతదేశం డి) సమరయోధుడు ► ‘మంచితనం అనేది చెప్పటానికి, వినటానికి తప్ప బతకటానికి పనిచేయదు’ అని నాగచైతన్య చెప్పిన డైలాగ్ ఏ సినిమాలోనిది? ఎ) ఆటోనగర్ సూర్య బి) దోచెయ్ సి) దడ డి) మనం ► జయలలిత, ఎస్. వరలక్ష్మి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) వింత కుటుంబం బి) విచిత్ర కుటుంబం సి) బంగారు కుటుంబం డి) ఆదర్శకుటుంబం ► ఏ తెలుగు సినిమాలో సంజయ్‌దత్ గెస్ట్‌రోల్‌లో చేశారు? (చిన్న క్లూ– ఈ సినిమాలో నాగార్జున హీరో) ఎ) నిన్నే పెళ్లాడతా బి) రక్షకుడు సి) చంద్రలేఖ డి) హలోబ్రదర్స్ ► ఈ ఫొటోలో ఉన్న చిన్ని కృష్ణుణ్ణి గుర్తుపట్టారా? ఎ) బాలకృష్ణ బి) జూ. ఎన్టీఆర్ సి) కల్యాణ్‌రామ్ డి) హరికృష్ణ ► జూ. ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ సినిమా కెమెరామేన్ ఎవరు? ఎ) పి.సి.శ్రీరామ్ బి) కె.కె. సెంథిల్ కుమార్ సి) ఛోటా కె. నాయుడు డి) శ్యామ్ కె.నాయుడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు : 1) సి 2) ఎ 3) బి 4) ఎ 5) బి 6) బి 7) ఎ 8) డి 9) ఎ 10) ఎ 11) ఎ 12) డి 13) సి 14) ఎ 15) బి 16) బి 17) డి 18) సి 19) డి 20) బి -
రావత్... వెండితెర రావణ్!
ఉత్తమ విలన్ కొన్ని సంఘటనలు ‘చిత్రం’గా జరుగుతాయి. సూచనప్రాయంగా కూడా చెప్పకుండా జరుగుతాయి. ‘ప్రదీప్ రావత్ ఎవరు?’ అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కాస్తో కూస్తో ఆలోచించవచ్చుగానీ...మన తెలుగు వాళ్లు మాత్రం టకీమని చెబుతారు. వీలైతే అతని డైలాగును ఒకసారి ఇలా గుర్తుతెచ్చుకుంటారు. ‘ఒక్క ముక్క చెప్పి ఉండాలి. చెప్పలే. అంటే...లెక్కలే! నేనంటే లెక్కలేని వాన్ని నా లెక్కలో ఉంచడం ఇష్టం లేదు’ రాజమౌళి ‘సై’ సినిమాకు ఒక విలన్ కావాలి. ఆషామాషీ విలన్ కాదు. గట్టి విలన్ కావాలి. సినిమా విజయానికి విలనే కీలకం! అందుకే రాజమౌళి విలన్ల వేటలో ఉన్నాడు. ఎందరినో... స్క్రీన్‌టెస్ట్, అడిషన్ టెస్టులు చేస్తున్నాడు. కానీ ఎవరూ నచ్చడం లేదు. దీంతో ‘నాకో మాంచి విలన్ కావాలి’ అంటూ తన అసిస్టెంట్‌ను ముంబైకి పంపించాడు. ఆ అసిస్టెంట్ ఎక్కడెక్కడ తిరిగాడోగానీ ఆరోజు అమీర్‌ఖాన్ ‘లగాన్’ సినిమా చూద్దామని డిసైడైపోయాడు. అతను అలా డిసైడై ఉండకపోతే....ప్రదీప్ రావత్ ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. మనకు ఒక ఉత్తమ విలన్ తెర మీద పరిచయమయ్యేవాడు కాదు! ‘లగాన్’ సినిమాకు కృతజ్ఞతలు. ‘లగాన్’లో దేవా అనే సర్దార్ పాత్ర పోషించాడు రావత్. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ పట్టణంలోని యు.సి.ఒ. బ్యాంకులో కొంత కాలం పని చేసిన ప్రదీప్ రామ్‌సింగ్ రావత్ ‘మహాభారత్’ టీవీ సీరియల్లో అశ్వత్థామ పాత్రతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘యుగ్’ టీవీ సీరియల్లో బ్రిటీష్ ఇన్స్పెక్టర్గా, ‘సర్ఫ్రోష్’ సినిమాలో ‘సుల్తాన్’గా నటించాడు. మళ్లీ ‘లగాన్’ దగ్గరకు వద్దాం. ‘లగాన్’లో దేవా దూకుడు రాజమౌళి అసిస్టెంట్‌కు బాగా నచ్చింది. ‘నేను వెదుకుతున్న విలన్ ఇతడే’ అనుకున్నాడు. రావత్‌ను సంప్రదించాడు. సౌత్ సినిమాలలో నటించడానికి విముఖంగా లేడుగానీ తనలో చిన్న సందేహం... ‘‘నాకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. భాష రాకపోతే బొమ్మలా నటించాల్సిందే...’’ అయితే ఈ సందేహాన్ని పక్కన పెట్టి అడిషన్ టెస్ట్‌కు హాజరయ్యాడు. ఓకే అనిపించుకున్నాడు. అలా తెలుగు వెండితెరపై బిక్షు యాదవ్‌గా అలరించాడు. నోటిలో పెద్ద చుట్ట. ముక్కుకు రింగు. కాటుక కళ్లు. పే...ద్ద మీసాలు. నాలుక మడతెట్టి వార్నింగ్ ఇచ్చే మ్యానరిజం... చూసీ చూడగానే తెలుగు ప్రేక్షకలోకానికి చేరవయ్యాడు రావత్. ఆ తరువాత... ‘భద్ర’లో వీరయ్య, ‘అందరివాడు’లో సత్తి బిహారి, ‘ఛత్రపతి’లో రాస్ బిహారి, ‘దేశముదురు’లో తంబిదురై, ‘యోగి’లో నరసింహ పహిల్వాన్, ‘జగడం’లో మాణిక్యం... ఇలా ఎన్నో పేర్లతో ఉత్తమ విలన్‌గా స్థిరపడ్డాడు రావత్. ఇక ‘గజినీ’ సినిమాలో రావత్ చెడ్డ విలనిజానికి మంచి పేరు వచ్చింది. రామ్-లక్షణ్గా సౌత్‌లో, ధర్మాత్మగా నార్త్‌లో ఆయన విలనిజానికి బోలెడు ‘చెడ్డ’ పేరు వచ్చింది. ‘‘బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటించకపోవడానికి కారణం ఏమిటి?’’ అనే ప్రశ్నకు- ‘‘అవకాశాలు రాకపోవడమే’’ అని చెప్పే రావత్ తనకు అవకాశం ఇచ్చిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ‘ఉత్తమ విలన్’గా గట్టి పేరు సంపాదించుకున్నాడు. ‘లగాన్’లో దేవ పాత్ర ముఖేష్ రుషి చేయాల్సింది. అయితే డేట్స్ సమస్య వల్ల ఆ పాత్రను ముఖేష్ వదులుకోవాల్సి వచ్చింది. ఆ అవకాశం రావత్‌కు వచ్చింది. ‘లగాన్’లో సర్దార్జీ పాత్ర ముఖేష్ చేసి ఉంటే....రావత్ ‘లగాన్’లో నటించేవాడు కాదు. ‘లగాన్’లో నటించకపోతే...రాజమౌళి దృష్టిలో పడి ఉండేవాడు కాదు. రాజమౌళి దృష్టిలో పడి ఉండకపోతే... సౌత్‌లో స్టార్ విలన్‌గా పేరుతెచ్చుకొని ఉండేవాడు కాదు... ఎంత చిత్రం! -
సినిమా రివ్యూ: వీరుడొక్కడే
తమిళంలో ఘన విజయం సాధించిన 'వీరం' చిత్రం 'వీరుడొక్కడే'గా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అన్యాయం, చెడు, ఫ్యాక్షన్‌ను ఎదిరించి...మంచి కోసం ఎంతవరకైనా తెగించే మనస్తత్వం కల వ్యక్తి వీరేంద్ర(అజిత్). తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన నలుగురు సోదరుల కోసం వీరేంద్ర పెళ్లికి దూరంగా ఉంటాడు. అన్యాయం, అక్రమాలను పాల్పడే వీరభద్రం (ప్రదీప్ రావత్) దుశ్చర్యల నుంచి ప్రజల్ని కాపాడుతుంటాడు. ఈ క్రమంలో తన సహచరులతో ఆ గ్రామంలోకి ప్రవేశించిన గోమతి దేవి (తమన్నా) అనే అర్కిటెక్ట్.. వీరేంద్ర ప్రేమలో పడేలా నలుగురు సోదరులు ప్లాన్ చేస్తారు. వీరేంద్ర మంచితనాన్ని చూసి గోమతి ప్రేమలో పడుతుంది. గోమతి ప్రేమ కోసం ఫ్యాక్షన్ కు దూరంగా ఉండాలని వీరేంద్ర నిర్ణయం తీసుకుంటాడు. తమ గ్రామంలో నాగరాజు (అతుల్ కులకర్ణి) గ్రూప్‌తో జరిగిన సంఘటన ప్రభావంతో హింస, గొడవలు, కొట్లాట, ఫ్యాక్షన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని గోమతి కుటుంబం నిర్ణయం తీసుకుంటుంది. వీరేంద్రను పెళ్లి చేసుకుందామనుకునుకున్న తరుణంలో గోమతిపై నాగరాజు గ్రూప్ ఎటాక్ చేస్తుంది. నాగరాజు గ్రూపును వీరేంద్ర ఎదుర్కొని.. గోమతిని ఆ దాడి నుంచి రక్షిస్తాడు.. అయితే ఆ సంఘటనలో వీరేంద్ర అసలు రూపాన్ని గోమతి చూస్తుంది. తనకు ఇష్టం లేని వ్యవహారాలే వీరేంద్ర జీవితంలో ప్రధానమైనవని తెలుసుకున్న గోమతి షాక్ అవుతుంది. వీరేంద్ర అసలు జీవితం తెలుసుకున్న తర్వాత గోమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? గోమతిపై ఎటాక్ ఎందుకు జరిగింది. నాగరాజు అసలు గోమతి కుటుంబంపై ఎందుకు పగ పెంచుకుంటాడు? నాగరాజు, వీరభద్రం గ్రూప్‌ల ఆటకట్టించి.. గోమతిని, తన కుటుంబాన్ని వీరేంద్ర ఎలా రక్షించుకున్నాడనే ప్రశ్నలకు సమాధానమే ’వీరుడొక్కడు’. మాస్, యాక్షన్ ఎలిమెంట్ పుష్కలంగా ఉన్న వీరేంద్ర పాత్రలో అజిత్ కనిపించారు. ప్రేమ కోసం హింస, ఫ్యాక్షన్ కు స్వస్తి చెప్పిన వ్యక్తిగా, ప్రేయసి కోసం, ప్రేమను పంచిన కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్లే మరో షేడ్ ఉన్న క్యారెక్టర్‌ను అజిత్ అవలీలగా పోషించాడు. అయితే గతంలో చాలా చిత్రాల్లోఇలాంటి పాత్రల్లో కనిపించిన అజిత్.. మరోసారి రొటీన్‌గానే అనిపించాడు. అర్కిటెక్ట్‌గా గోమతి పాత్రలో ఓ సంప్రదాయ యువతిగా తమన్నా కనిపించింది. ఈ చిత్రంలో గోమతి పాత్ర ప్రధానమైనప్పటికి... సహజంగా ప్రేక్షకులు ఆశించే గ్లామర్ మిస్ కావడం నిరాశ కలిగించే అంశం. గోమతి పాత్ర కారెక్టరైజేషన్ పర్ ఫెక్ట్‌గా లేకపోవడం కొంత మైనస్. అంతేకాకుండా గోమతి పాత్ర కృత్రిమంగా కనిపిస్తుంది. విలన్లు ప్రదీప్ రావత్, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించినా.. చిత్రంలో పూర్తిస్థాయిలో ప్రభావం చూపేలా విలనిజం లేకపోవడం ప్రధాన లోపమని చెప్పవచ్చు. తమన్నా తండ్రిగా నాజర్ పర్వాలేదనిపించారు. ఈ చిత్రంలో బాగా నచ్చే అంశం లాయర్ పాత్రలో సంతానం పండించిన కామెడీ. సంతానం కామెడి ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గొప్పగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వెట్రీ ఫోటోగ్రఫి చిత్రానికి అదనపు ఆకర్షణ. యాక్షన్ సీన్ల చిత్రీకరణ రిచ్‌గా ఉంది. భూపతి రాజా, శివ అందించిన కథలో కొత్తదనం లేకపోయింది. సంతానంపై చిత్రీకరించిన కామెడీ సీన్లలో డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. తమిళంలో ‘వీరం’ పేరుతో విడుదలై.. ఘన విజయాన్ని సాధించిన వీరుడొక్కడే చిత్రం తెలుగు ప్రేక్షకులకు రొటీన్ చిత్రమనే చెప్పవచ్చు. పగ, ప్రతీకారం, ఫ్యాక్షన్ అంశాలే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.


