ప్రదీప్ రావత్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? | Tollywood Villain, Actor Pradeep Rawat Net Worth Goes Viral | Sakshi
Sakshi News home page

Pradeep Rawat: ప్రదీప్ రావత్.. ఆస్తులు ఎన్ని కోట్లంటే?

Aug 5 2026 3:59 PM | Updated on Aug 5 2026 4:15 PM

Tollywood Villain, Actor Pradeep Rawat Net Worth Goes Viral

సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రల్లో మెప్పించిన ప్రదీప్ రావత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముంబయిలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. ఆయనతో నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు.

కాగా.. హిందీ మూవీ బాఘితో  సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత  నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్‌షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్‌, నాయక్‌, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు.  తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు.

ఆయన మరణం వేళ ఓ ఆసక్తకర విషయంపై చర్చ నడుస్తోంది. ప్రదీప్ తన కెరీర్‌లో ఎంత సంపాదించారని నెట్టింట వెతికేస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన ఆయన ఆస్తి ఎంతనేదానిపై పలు నివేదికలు ప్రచురించాయి. ఆయన ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.20 నుంచి 40 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. వీటిలో స్థిర, చరాస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటి గురించి ఎలాంటి అధికారిక సమాచారమైతే లేదు.  ప్రదీప్‌ దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించి బాగానే సంపాదించారని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

ప్రదీప్ తన కెరీర్‌లో ఎన్నో గొప్ప పాత్రలు పోషించినప్పటికీ.. ఆమిర్ ఖాన్ సరసన పోషించిన గజినీ ధర్మాత్మ పాత్ర ఆయన కెరీర్‌లో అత్యంత గుర్తింపు తీసుకొచ్చింది. ఈ చిత్రం బాలీవుడ్‌లో  రూ.100 కోట్లు సాధించి.. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా లగాన్, సర్ఫరోష్, కోయ్లా, మేజర్ సాబ్, సయే, స్టాలిన్, వీరం, జిల్లా, వాల్తేర్ వీరయ్య, టైగర్ నాగేశ్వరరావు, ఛావా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కాగా.. రావత్‌కు భార్య కళ్యాణి రావత్, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement