టాలీవుడ్ విలన్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్(74) చనిపోయారు. గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన మంగళవారం సాయంత్రం ముంబైలో తుదిశ్వాస విడిచారు. పలు భాషల్లో 150కి పైగా సినిమాలు చేసిన ఈయనకు ఆంధ్రాతో సంబంధముంది. అవును ఈయన తెలుగింటి అల్లుడు అనే సంగతి చాలామందికి తెలీదు. ఈ విషయాన్ని గతంలో ఈయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
(ఇదీ చదవండి: భర్త కోసం 26 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఆ హీరోయిన్)
ప్రదీప్ రావత్ భార్య పేరు కల్యాణి. ఈమెది కాకినాడ. 'స్టాలిన్' షూటింగ్ టైంలో మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. వీళ్లకు విక్రమ్, సింగ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. బయట ప్రదీప్ రావత్-కల్యాణి.. లో ప్రొఫైల్ మెంటైన్ చేస్తుంటారు. తన భర్తది చాలా సున్నితమైన మనసు అని గతంలో ఓసారి కల్యాణి చెప్పారు. కల్యాణికి కూడా సినీ రంగంతో అనుబంధం ఉందమున్నట్లు తెలుస్తోంది. మోడలింగ్‌లో కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. పలు కమర్షియల్ యాడ్స్, హిందీ సీరియల్స్‌లో నటించారట.
ప్రదీప్ రావత్ కెరీర్ విషయానికొస్తే.. 1985లో నటుడిగా పరిచయమయ్యారు. తొలుత సీరియల్స్ చేశారు. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్ టీవీ సీరియల్‌లో అశ్వత్థామ పాత్రలో నటించారు. ఆమిర్ ఖాన్ లగాన్‌లోనూ కీలక పాత్ర చేశారు. 2004లో రాజమౌళి తీసిన 'సై'తో తెలుగులోకి వచ్చారు. ఇందులో ఇతడు చేసిన భిక్షు యాదవ్ పాత్ర బాగా హైలెట్ అయ్యింది. తర్వాత భద్ర, అందరివాడు, ఛత్రపతి, లక్ష్మీ, స్టాలిన్, దేశముదురు, యోగి, గజినీ, మస్కా, రగడ, రాజన్న, రెబల్, నాయక్, నేనొక్కడినే, లయన్, సరైనోడు, నేను శైలజ, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, నేనే రాజు నేనే మంత్రి, జై లవకుశ, ఆడాళ్లు మీకు జోహార్లు, వాల్తేర్ వీరయ్య చేశారు. చివరగా ఈ ఏడాది మేలో వచ్చిన 'గాయపడ్డ సింహం'లో కనిపించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)


