భర్త కోసం 26 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి | Ajith Kumar’s AK64 Titled ‘Dare Devil’: Former Actress Shalini Turns Producer with Bravehearts Production | Sakshi
Sakshi News home page

Ajith Shalini: అజిత్ కొత్త సినిమా.. సర్‌ప్రైజింగ్ విషయం

Aug 5 2026 8:37 AM | Updated on Aug 5 2026 10:04 AM

Ajith New Movie Dare Devil And Shalini Turned Producer

తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌‌కి తెలుగులో మోస్తరు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చివరగా 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' మూవీతో ఆకట్టుకున్నాడు. తర్వాత ఆయన కార్‌ రేస్‌ పోటీలపై శ్రద్ధ చూపడంతో ఇప్పటి వరకు కొత్త సినిమా ఏంటనేది క్లారిటీ రాలేదు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. తనతో 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' తీసిన ఆధిక్‌ రవిచంద్రన్‌‌కే డైరెక్షన్ ఛాన్స్ మళ్లీ ఇచ్చాడు. 'డేర్ డెవిల్' అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

ఈ సినిమాని అజిత్‌ భార్య, ఒకప్పటి హీరోయిన్ శాలిని నిర్మించనున్నారు. బ్రేవ్‌ హార్ట్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించారు.కమర్షియల్‌ అంశాలతో పూర్తి యాక్షన్‌ ఎంటర్టైనర్‌‌గా ఇది ఉంటుందని సమాచారం. అనిరుధ్ సంగీతమందింస్తుండగా షూటింగ్‌ త్వరలో మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు టాక్. మొత్తం మీద 16 నెలల తర్వాత అజిత్‌ తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు.

అలానే అజిత్‌‌తో 2000లో పెళ్లి అయిన తర్వాత శాలిని సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మళ్లీ ఇన్నేళ్లకు అంటే 26 ఏళ్ల తర్వాత నిర్మాతగా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇకపోతే అజిత్‌ 64వ చిత్రంలో శ్రీలీల నాయకిగా నటించనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె ఈ చిత్రంలో ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ సైకలాజికల్ హారర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement