కార్తీ ఇంత స్పీడుగా ఉన్నాడేంటి? | Karthi Teams Up With Director Mohan Raja for a Wholesome Family Entertainer | Sakshi
Sakshi News home page

Karthi-Mohan Raja: చిరుతో చేసిన నాలుగేళ్లకు కొత్త సినిమా

Aug 5 2026 8:49 AM | Updated on Aug 5 2026 10:07 AM

Karthi New Movie With Director Mohan Raja

తమిళ హీరో కార్తీ స్పీడ్‌ పెంచాడు. 'సర్దార్‌ 2' సినిమా మరో నెలలో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థతోనే కార్తీ మరో ప్రాజెక్ట్ లాక్ చేశాడు. దీనికి మోహన్‌ రాజా దర్శకుడు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. తమిళ 'జయం'తో డైరెక్టర్ అయిన ఇతడు.. సంతోష్‌ సుబ్రహ్మణ్యం(బొమ్మరిల్లు రీమేక్), వేలాయుధం, తనీ ఒరువన్‌ తదితర మూవీస్ చేశాడు. ఇప్పుడు కార్తీ 25వ చిత్రం చేసే అవకాశం అందుకున్నాడు. చివరగా చిరంజీవితో 2022లో 'గాడ్ ఫాదర్' తీసిన మోహన్ రాజా మళ్లీ ఇన్నాళ్లకు మూవీ ఓకే చేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

మరోవైపు కార్తీ అయితే యమస్పీడుగా ఉన్నాడు. సర్దార్ 2 రిలీజ్ కానుండగా మార్షల్, హిట్ 4, తెలుగు దర్శకుడు కల్యాణ్ శంకర్‌తో మూవీ చేయాల్సి ఉంది. అలానే లోకేశ్ కనగరాజ్ ఫ్రీ అయితే 'ఖైదీ 2' కూడా చేయాలి. ఇవి కాకుండా మరికొందరు తెలుగు, తమిళ దర్శకులు.. కార్తీతో మూవీస్ చేయాలని అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: భర్త కోసం 26 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఆ హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement