వరుస చిత్రీకరణలతో కీర్తి సురేష్‌కి సరైన నిద్ర ఉండటం లేదట. ఇటీవల నాన్‌స్టాప్‌గా ఇరవైగంటలు షూటింగ్‌లో పాల్గొన్నారామె. ఈ విషయంపై కీర్తి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘నిన్న ఉదయం ఆరు గంటలకు నా గది నుంచి బయలుదేరాను. మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు గదికి చేరుకున్నాను. ఇందులో 20 గంటలు పనిలోనే ఉన్నాను. మరో గంటలో మరో షూట్‌లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది.
ఇది ఇబ్బందికరంగా ఉందని చెప్పడంలేదు. ఇంత బిజీగా పని చేయడాన్ని ఆశీర్వాదంలా భావిస్తున్నాను’’ అని కీర్తి తన ఇన్‌స్టా స్టోరీలో ఆగస్టు 3న ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోపై 41 గంటలు మేల్కొని ఉన్నానని క్యాప్షన్ జోడించారామె. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్, కళ్యాణ్‌రామ్ హీరోలుగా నటిస్తున్న సినిమాలో, ‘రౌడీ జనార్ధన’లో, తమిళంలో ‘డోరోతి’లో కీర్తి హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే నాని ‘ది ప్యారడైజ్’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారట. హిందీలో ‘రఫ్తార్’ నటిస్తున్నారు కీర్తి.


