పాట... ఫైటు... | Ram Pothineni RAPO23 movie up dates | Sakshi
Sakshi News home page

పాట... ఫైటు...

Aug 5 2026 1:01 AM | Updated on Aug 5 2026 1:01 AM

Ram Pothineni RAPO23 movie up dates

పాండిచ్చేరిలో పాట, ఫైట్‌లతో హీరో రామ్‌ బిజీగా ఉన్నారు. రామ్‌ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘ఆర్‌ఏపీవో23’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాను రా పో సినిమాటిక్స్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పాండిచ్చేరిలో జరుగుతోంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్‌ సీక్వెన్స్, ఓ పాట చిత్రీకరణను ప్లాన్‌ చేశారు.

‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1, కాంతార, కరుప్పు’ చిత్రాల ఫేమ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ విక్రమ్‌ మోర్‌ యాక్షన్‌ సీకెన్స్‌లను డిజైన్‌ చేస్తుండగా పాటకు బృందా మాస్టర్‌ కొరియోగ్రఫీ వహిస్తున్నారు. ‘‘కొత్త రకమైన క్యారెక్టరైజేషన్స్‌తో, కొత్త తరహా మేకింగ్‌తో రూపొందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement