ఓజీ-2కు బ్రేక్.. సుజీత్ ప్లాన్ మారింది | Sujeeth to Direct Nani's 'Bloody Romeo' First Before Pawan Kalyan's OG-2 | Sakshi
Sakshi News home page

ఓజీ-2కు బ్రేక్.. సుజీత్ ప్లాన్ మారింది

Aug 4 2026 11:06 PM | Updated on Aug 5 2026 9:37 AM

Sujeeth Nani Movie First After that Pawan Kalyan OG-2

దర్శకుడు సుజీత్ తదుపరి ప్రాజెక్ట్ విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పవన్ కల్యాణ్‌తో తెరకెక్కనున్న ఓజీ-2 కంటే ముందుగా నాని హీరోగా రూపొందనున్న 'బ్లడీ రోమియో' చిత్రాన్నే సుజీత్ ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.

ఓజీ-2 ప్రకటన వెలువడిన తర్వాత నాని-సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్ వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా సుజీత్ కూడా ఓజీ-2 ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టడం, లొకేషన్ల పరిశీలన చేపట్టడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

అయితే తాజా పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. నాని ప్రస్తుతం చేస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో, తదుపరి ప్రాజెక్ట్‌గా 'బ్లడీ రోమియో'ను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం నాని తన కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

అక్టోబర్ నుంచి 'బ్లడీ రోమియో' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌ను ఢిల్లీలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అనంతరం లండన్‌లో కీలకమైన, భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత దర్శకుడు సుజీత్ పూర్తిస్థాయిలో ఓజీ-2 పనులపై దృష్టి సారించనున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement