సినీ పరిశ్రమలో విషాదం.. ఛత్రపతి విలన్ కన్నుమూత | Veteran Actor Pradeep Rawat Passes Away Due to Heart Attack | Sakshi
Sakshi News home page

Pradeep Rawat: సినీ పరిశ్రమలో విషాదం.. ఛత్రపతి విలన్ కన్నుమూత

Aug 4 2026 9:27 PM | Updated on Aug 4 2026 10:23 PM

Veteran actor Pradeep Rawat Passed Away with Heart Stroke

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్(74) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన క్యాన్సర్‌తోనూ పోరాడుతున్నారు. చివరికీ ఇవాళ ఇలా కన్నుమూశారు. 

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జనవరి 21, 1952లో జన్మించిన ప్రదీప్ రావత్.. సినీ ఇండస్ట్రీలో విలన్‌గా మెప్పించారు. కామెడీ పాత్రలతో పాటు విలన్‌గానే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్‌లో నితిన్ హీరోగా వచ్చిన సై మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాస్ ఛత్రపతిలో రాజ్‌ బిహారి పాత్రలో విలన్‌గా ఆకట్టుకున్నారు. అంతే కాకుండా సూర్య హీరోగా వచ్చిన గజిని మూవీలో విలన్‌గా రాణించారు. ఈ ఏడాదిలో ఇటీవలే రిలీజైన గాయపడ్డ సింహం చిత్రంలో చివరిసారిగా కనిపించారు.

బాఘీతో ఎంట్రీ..

హిందీలో బాఘీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో ప్రతినాయక సహాయ పాత్రలతో మరింత గుర్తింపు పొందారు. బి.ఆర్. చోప్రా తెరకెక్కించిన ప్రసిద్ధ టీవీ ధారావాహిక మహాభారత్‌లో అశ్వత్థామ పాత్ర పోషించారు. సై సినిమాకు విలన్‌గా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. తెలుగులో లక్ష్మీ, స్టాలిన్, నాయక్, 1: నేనొక్కడినే', సరైనోడు, భద్ర, యోగి, దేశముదురు, అందరివాడు, స్టాలిన్‌, లగాన్, గజిని లాంటి చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా రాజన్న, పూలరంగడు, బాద్‌షా, సౌఖ్యం, వీర, అల్లుడు శీను, లయన్‌, రగడ, బలాదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో మెప్పించారు.  



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement