బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ షోకు అంతా రెడీ అవుతోంది. ఇప్పటికే హిందీ బిగ్‌బాస్ తేదీని కూడా రివీల్ చేశారు. ఇటీవలే ప్రోమో రిలీజ్ చేసి సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానుందని ప్రకటింటచారు. దీంతో టాలీవుడ్ అభిమానులు సైతం తెలుగు సీజన్-10 ఎప్పుడా అని ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
బిగ్‌బాస్ సీజన్-10 ప్రోమో షూటింగ్ ఇటీవలే పూర్తయిందని నాగ్ వెల్లడించారు. ఈ సారి పదో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సీజన్ మరింత ఉన్నతంగా ప్లాన్ చేస్తున్నారని.. గతం కంటే ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. ఇతరుల ప్రవర్తనను నిర్ణయించడం, సూచనలు చేయడం నాకిష్టం ఉండదన్నారు. అందుకే మొదటి రెండు సీజన్లలో కాస్తా ఇబ్బంది పడ్డానని.. ఆ తర్వాత షో ఫార్మాట్ అలవాటైందని వెల్లడించారు. గత సీజన్ సూపర్ హిట్ కావడంతో ఈసారి ఫిజికల్ టాస్కులు మరింత కఠినంగా ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. అంతే కాకుండా ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్లు హద్దులు దాటి ప్రవర్తిస్తే అస్సలు సహించననని నాగ్ స్పష్టం చేశారు.


