సూర్య కంటే మూడింతలు ఎక్కువ సంపాదించా | Once Jyothika Got Three Times Higher Remuneration Than Suriya | Sakshi
Sakshi News home page

Suriya Jyothika: మేం ఏదైనా కలిసే నిర్ణయం తీసుకుంటాం

Aug 5 2026 3:21 PM | Updated on Aug 5 2026 3:30 PM

Once Jyothika Got Three Times Higher Remuneration Than Suriya

సినిమా సెలబ్రిటీల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. వాళ్లలో సూర్య-జ్యోతిక జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే బంధాన్ని అలా మెంటైన్ చేస్తుంటారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఎవరికివాళ్లు బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇద్దరూ కలిసి కనిపించారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడారు. జ్యోతిక అయితే అప్పట్లో సూర్య కంటే తానే మూడింతలు ఎక్కువ సంపాదించానని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఏదో ఒకరోజు కమ్యూనిజందే గెలుపు.. శోభిత రాజకీయ వ్యాఖ్యలు)

'సూర్య భర్తగా చాలా గొప్ప వ్యక్తి. సమానత్వం అనేది ఆయన మనసులో మొదట నుంచి ఉంది. అది పుట్టుకతోనే రావాలి. అమ్మాయిలకు వంట చేయడం రాకపోయనా ఏదైనా పని ఇష్టం లేదని చెప్పినా సరే అని వదిలేయడం చాలావరకు సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ మా ఇంట్లో అలానే జరుగుతుంది. నేను ఫెమినిస్ట్‌గా మాట్లాడటం లేదు. మా ఇంట్లో మేమిద్దరం సమానమే'

'సినిమాని నిర్మించడం దగ్గర నుంచి పిల్లల్ని పెంచడం, సెలవుల్లో తిరగడం వరకు ప్రతిదీ మేం కలిసే నిర్ణయం తీసుకుంటాం. ఒకరి ఎదుగుదలని చూసి మరొకరం ఆనందించడం మాకు చాలా ఇష్టమైనది. ఆ రోజుల్లో సూర్య పారితోషికం కంటే నాది మూడింతలు ఎక్కువ. కానీ ఇప్పుడు 30 రెట్లు తగ్గింది' అని జ్యోతిక చెప్పుకొచ్చింది.

ఇకపోతే ఈ ఏడాది 'కరుప్పు'తో సక్సెస్ అందుకున్న సూర్య.. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. వచ్చే శుక్రవారం.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే సినిమాతో రాబోతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకుడు కాగా నాగవంశీ నిర్మాత. మమిత బైజు హీరోయిన్.

(ఇదీ చదవండి: 200 రోజులు కష్టపడితే ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే బ్లాక్‌బస్టర్: సూర్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement