రెండు భాగాలుగా సందీప్ కిషన్ 'కరికాల' | Sundeep Kishan Karikaala Movie Details | Sakshi
Sakshi News home page

Sundeep Kishan: 'శంబాల' దర్శకుడి ఫాంటసీ సినిమా ప్రకటన

Aug 5 2026 2:03 PM | Updated on Aug 5 2026 2:20 PM

Sundeep Kishan Karikaala Movie Details

రీసెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరో సందీప్ కిషన్.. 'సూపర్ సుబ్బు'గా అలరించాడు. అలానే తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తొలిసారి దర్శకుడిగా మారి తీసిన 'సిగ్మా'లోనూ నటించాడు. ఇది త్వరలో థియేటర్లలోకి రానుంది. ఇవలా ఉండగానే కొత్త చిత్రాన్ని ప్రకటించాడు.

కొన్నాళ్ల క్రితం 'శంబాల' మూవీతో అలరించిన దర్శకుడు యుగంధర్ ముని.. సందీప్ కిషన్‌తో కలిసి చేస్తున్న సినిమాకు 'కరికాల' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనిని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫాంటసీ అడ్వెంచర్ కథతో తీసిన ఈ చిత్ర తొలి భాగం వచ్చే ఏడాది జూలై 02న, రెండో భాగం అక్టోబరు 28న థియేటర్లలోకి రానుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement