‘మిస్సింగ్‌ మేఘన’ హిట్‌ కావాలి : వి.వి. వినాయక్‌ | V V Vinayak Launches Missing Meghana Movie First Look Poster | Sakshi
Sakshi News home page

‘మిస్సింగ్‌ మేఘన’ హిట్‌ కావాలి : వి.వి. వినాయక్‌

Aug 5 2026 12:08 PM | Updated on Aug 5 2026 12:12 PM

V V Vinayak Launches Missing Meghana Movie First Look Poster

 రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్సింగ్‌ మేఘన’. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో  గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారు మాట్లాడుతూ .. ‘బెక్కం వేణుగోపాల్ , శ్రీనివాస్ సపోర్ట్ తో వాచస్పతి దర్శకుడిగా వస్తున్న సినిమా మిస్సింగ్ మేఘన. ఈ సినిమా తో హీరో రామ్ కార్తీక్ కి దర్శకుడు వాచస్పతికి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా సంగీత దర్శకుడు ధృవన్‌కి మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో ఈ టీం కి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ ..‘ఈ సినిమా ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రేక్షకులు మిచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.
‘ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు వాచస్పతి గారికి ప్రొడ్యూసర్ నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది అని ఆశిస్తున్నా’అని హీరో రామ్‌ కార్తీక్‌ అన్నారు.

‘ఈ సినిమా కి మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మ్యూజిషియన్ కి మ్యూజిక్ చేయడానికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా నాకు చాలా మంచి అవకాశం. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మా టీం ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధృవన్  అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement