ఒకే ఓటీటీలోకి వచ్చేసిన ‍తెలుగు సినిమాలు | Vidhaatha And Dark Secrets Telugu Movies OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్ సడన్ స్ట్రీమింగ్

Aug 5 2026 11:29 AM | Updated on Aug 5 2026 11:38 AM

Vidhaatha And Dark Secrets Telugu Movies OTT Streaming Now

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా.. ఓ సుకుమారి, లెనిన్, హృదయం మురళి, వంద దేవుళ్లు, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వదంది 2, ఆపరేషన్ సఫేద్ సాగర్ లాంటి డబ్బింగ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇవలా ఉండగానే సడన్‌గా రెండు తెలుగు మూవీస్ ఓటీటీలోకి వచ్చేశాయి.

(ఇదీ చదవండి: ఇది తెలుసా? ప్రదీప్ రావత్ తెలుగింటి అల్లుడే)

ఈ ఏడాది మార్చి 05న థియేటర్లలో రిలీజైన 'విధాత' (2026) ఓ తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. భావోద్వేగాలతో పాటు క్రైమ్, సస్పెన్స్ అంశాలు ఇందులో ఉన్నాయి. మణికాంత రాజేంద్రబాబు దర్శకత్వం వహించగా భాస్కరాచారి, శ్రీనివాసులు నాయుడు, సురేష్ అప్పలబట్ల ప్రధాన పాత్రలు చేశారు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.

అప్సరరాణి, నైనిక అనసూయ, జయశ్రీ, నీలిమ చౌదరి ప్రధాన పాత్రలు చేసిన ఆంథాలజీ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'డార్క్ సీక్రెట్స్'. ఇదయితే నేరుగా హంగామా ఓటీటీలో రిలీజైంది. అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. నలుగురు అమ్మాయిల జీవితాల్లోని రహస్యాల నేపథ్య కథతో దీన్ని తెరకెక్కించారు.

'అన్ ఐడెంటిఫైడ్' అనే అరబిక్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా గతేడాది సెప్టెంబరులో సౌదీ అరేబియాలోని థియేటర్లలో రిలీజైంది. ఈ ఏడాది జూన్‌లో మిగతా దేశాల్లో విడుదలైంది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. సౌదీలో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఎడారిలో దొరికిన టీనేజీ అమ్మాయి అనాథ శవం నేపథ్యం దీని స్టోరీ. 

(ఇదీ చదవండి: విజయ్ కాదు మహేశ్ ఆ సినిమా చేయాలి.. ఒక్క సీన్ కారణంగా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement