‘‘ఇప్పటి జెన్ జీకి ఫ్యామిలీ ఎమోషన్స్ పెద్దగా తెలియడం లేదు. ఈ ఎమోషన్స్‌ని మళ్లీ అందరికీ గుర్తు చేయాలనే సందేశంతోనే ‘అనకాపల్లి’ సినిమా తీశాం’’ అన్నారు దర్శక–నిర్మాత నక్కిన త్రినాథరావు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ఠ, తారక్ పొన్నప్ప ప్రధాన తారాగాణంగా ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు నిర్మించిన సినిమా ‘అనకాపల్లి’. కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘బలమైన కుటుంబ భావోద్వేగాలతో ఓ టౌన్‌లో జరిగే లవ్‌స్టోరీ సినిమా ఇది. షూటింగ్ మొత్తాన్ని అనకాపల్లిలోనే పూర్తి చేశాం. అనకాపల్లి అనగానే అనకాపల్లి బెల్లం, నూకాంబిక అమ్మవారి ఆలయం కచ్చితంగా గుర్తుకువస్తాయి. ఈ రెండు అంశాలు సినిమా అంతా కనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి, నిర్మిస్తూనే, ఓ క్యారెక్టర్ కూడా చేశాను. నేను చేసిన ఈ మిడిల్ క్లాస్ ఫాదర్ పాత్రకు కాస్త పొట్ట ఉండాలని దర్శకుడు కోరారు.
అందుకే ప్రతీ రోజూ సెట్‌కి వెళ్లేప్పుడు బిర్యానీ ఫుల్లుగా తినేసేవాడ్ని (నవ్వుతూ). కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో సినిమా అనేది చాలా గొప్పది. ఒక బడ్జెట్ పెడుతున్నామంటే ఎంతోమందికి ఉ΄ాధి కలుగుతుంది. కష్టపడేది వాళ్లు అయినా పేరు మాకు వస్తుంది. ఇలా కష్టపడే వాళ్ల కోసమే బ్యానర్లు స్థాపించి, సినిమాలు నిర్మిస్తున్నాం. ఈ సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చింది. మంచి కథతో ΄ాటు కుటుంబ విలువలను తెలియజేసే మంచి సందేశం ఉంది’’ అని అన్నారు.


