మరో నాలుగు రోజుల్లో మహేశ్ బాబు పుట్టినరోజు. 'దూకుడు' సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ తీసిన దర్శకుడు శ్రీనువైట్ల చెప్పిన ఓ విషయం బాగా హైలెట్ అవుతోంది. 'దూకుడు'లో టెర్రస్‌పై సీన్ చేసిన మహేశ్.. తన ఆలోచన మార్చుకుని ఏకంగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేయాల్సిన చిత్రాన్ని వదులుకున్నారని స్వయంగా శ్రీనువైట్ల చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: భర్త కోసం 26 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఆ హీరోయిన్)
'ఆ రోజు మహేశ్, నమ్రతకు ఫోన్ చేసి.. 'నేను ఆ సినిమా చేయడం లేదు. నాకు 'దూకుడు' చాలా ముఖ్యం. ఇదే చేస్తున్నాను' అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. బాబు.. శంకర్ గారి సినిమా, నేను కూడా పెద్ద ఫ్యాన్‌ని.. మీరు అలా ఎలా రిజెక్ట్ చేస్తారు అని అడగ్గా.. లేదండి నేను ఈ సినిమానే చేస్తాను. ఇది నాకు చాలా ముఖ్యం. మీరు డీల్ చేసిన విధానం చాలా బాగా నచ్చిందండి అని నాతో అన్నారు. ఆయన నమ్మకమే నిజమైంది. 'దూకుడు' బ్లాక్‌బస్టర్‌గా నిలిచి మహేశ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయింది' అని శ్రీనువైట్ల చెబుతున్న పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
అయితే మహేశ్ రిజెక్ట్ చేసిన శంకర్ సినిమా 'స్నేహితుడు'నే అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. 'దూకుడు' 2011 సెప్టెంబరులో రిలీజ్ కాగా తర్వాత ఏడాది 'స్నేహితుడు' వచ్చింది. హిందీలో హిట్ అయిన 'త్రీ ఇడియట్స్' రీమేక్ ఇది. తమిళంలో 'నన్బన్' పేరుతో రిలీజ్ కాగా తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. దళపతి విజయ్ హీరోగా నటించాడు.
(ఇదీ చదవండి: ఇది తెలుసా? ప్రదీప్ రావత్ తెలుగింటి అల్లుడే)
“When I shot the rooftop sequence (phone call with Sonu Sood after catching Bunty), Superstar @urstrulyMahesh was highly impressed. On the same night, he cancelled Shankar garu’s film and felt this was more important” - #SreenuVaitla#MaheshBabu | #Dookudu pic.twitter.com/65pKXLdx9W
— VardhanDHFM (@_VardhanDHFM_) August 4, 2026


