బన్నీ, మహేశ్‌కి పోటీ.. చరణ్-ఎన్టీఆర్ కూడా బిజినెస్‌లోకి? | After Mahesh Babu And Allu Arjun, Are Jr NTR And Ram Charan Entering The Multiplex Business? Rumours Went Viral | Sakshi
Sakshi News home page

Ntr-Ram Charan: చరణ్, ఎన్టీఆర్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి?

Jul 31 2026 4:07 PM | Updated on Jul 31 2026 4:21 PM

Ntr And Ram Charan Enter Into Multiplex Business

తెలుగు స్టార్ హీరోలు ఓవైపు సినిమాలు చేస్తున్నప్పటికీ మరోవైపు బిజినెస్‌ల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. మిగతా వ్యాపారాల సంగతేమో గానీ మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ.. ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ‍అడుగుపెట్టేశారు. అవి విజయవంతంగా సాగుతున్నాయి కూడా. ఇప్పుడు వీళ్లకు పోటీగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఇదే వ్యాపారంలోకి రాబోతున్నారని సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకోవడంపై నటి సురేఖావాణి క్లారిటీ)

హైదరాబాద్‌లో మహేశ్ బాబుతో ఏఎమ్‌బీ, ‍అల్లు అర్జున్‌తో ఏఏఏ, రవితేజతో ఏఆర్‌టీ మల్టీప్లెక్స్‌ల్లో భాగస్వామి అయిన ఆసియన్ సినిమాస్ సంస్థతో రామ్ చరణ్ కూడా జట్టుకట్టారని.. త్వరలోనే ఏఆర్‌సీ పేరుతో హైదరాబాద్‌లోనే ఓ మల్టీప్లెక్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నారని టాక్.

మరోవైపు ఎన్టీఆర్.. సొంతంగా గచ్చిబౌలిలో ప్రీమియం మల్టీప్లెక్స్ కట్టే ఆలోచనలో ఉన్నాడని ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఈ ఇద్దరి హీరోలు, థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చే విషయమై గట్టిగానే పుకార్లు వినిపిస్తున్నప్పటికీ ఇందులో నిజానిజాల సంగతి ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం టాలీవుడ్ సినిమాల పరంగానే కాదు మల్టీప్లెక్స్‌ల పరంగా పోటీ పడుతున్నట్లు అవుతుంది.

(ఇదీ చదవండి: మహేశ్ అన్న కొడుకు సినిమా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement