అల్లు అర్జున్‌లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు? | Allu Arjun Unique Fan Meet Strategy Trending On Social Media, 900 Fans From 7 States, Photos, Promises And More | Sakshi
Sakshi News home page

Allu Arjun: అభిమానులతో మీటింగ్.. అందరికీ ఇన్సూరెన్స్‌లు

Jul 29 2026 3:51 PM | Updated on Jul 29 2026 6:13 PM

Allu Arjun Fans Meet And Other Actor Reaction

అల్లు అర్జున్ సినిమా థియేటర్లలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. కొత్త మూవీ రావడానికి మరో ఏడాది లేదంటే ఏడాదిన్నర పట్టొచ్చు. కానీ ఎలాంటి హడావుడి లేకుండా 900 మంది అభిమానుల్ని పిలిచి హైదరాబాద్‌లో ఓ మీటింగ్ ఏ‍ర్పాటు చేసి బన్నీ కలిశాడు. ఏకంగా ఏడు రాష్ట్రాల నుంచి వందలాది మంది ఫ్యాన్స్‌ని పిలిచి వాళ్లని పేరుపేరున పలకరించి ఫొటోలిచ్చి తలో రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఓసారి కలుస్తానని మాటిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు,వీడియోలు నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ ఎమోషనల్ లవ్ సినిమా)

తెలుగులో దాదాపు అందరు హీరోలకు ఫ్యాన్స్, వీరాభిమానులు ఉన్నారు. కాకపోతే వాళ్లని ఆర్గనైజ్ చేసి ప్రతి ఏడాది మీటింగ్ పెట్టి వాళ్లతో కలిసిపోయే హీరోలు ఎంతమంది ఉన్నారా అని చూస్తే.. అల్లు అర్జున్ తప్పితే ఎవరూ కనిపించడం లేదు. బన్నీ ఈ మీటింగ్ పెట్టడం మాటేమో గానీ తమిళ హీరో విజయ్‌లా రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తాడు. అందుకే ఇలా ఇప్పటినుంచి ఫ్యాన్స్‌ని ప్రిపేర్ చేస్తూ ప్రతి ఏడాది కలుస్తున్నాడని చాలామంది అంటున్నారు. అందులో నిజానిజాల ఏంటనేది భవిష్యత్తులో తెలుస్తుంది.

ప్రతి ఏడాది కలవడం, వాళ్లకు ఫొటోలు ఇవ్వడం, ఇన్సూరెన్స్ చేయించడం లాంటివి చేస్తే సదరు అభిమానులు.. అల్లు అర్జున్‌పై మరింత ప్రేమని పెంచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైపెచ్చు సినిమాలు రిలీజైనప్పుడే కాకుండా మిగతా సమయాల్లోనూ అభిమాన హీరో కోసం నిలబడతారు. ప్రతిఫలం ఆశించకుండానే పనిచేస్తారు. ఈ హంగామా అంతా చూస్తుంటే అలానే అనిపిస్తుంది. మరి అల్లు అర్జున్ చేస్తున్నట్లు మిగతా తెలుగు స్టార్ హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారనేది ఇక్కడ ప్రశ్న. 

(ఇదీ చదవండి: నచ్చలేదా వదిలేయ్... రూ.1 కూడా ఖర్చు పెట్టకు: అల్లు అర్జున్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement