నచ్చలేదా వదిలేయ్... రూ.1 కూడా ఖర్చు పెట్టకు: అల్లు అర్జున్ | Allu Arjun Reacts Social Media Trolls Latest Fans Meet | Sakshi
Sakshi News home page

Allu Arjun: నచ్చిన అమ్మాయి ఇంటి బయట నిల్చో.. ఎంజాయ్ చేస్తావ్

Jul 28 2026 3:10 PM | Updated on Jul 28 2026 4:20 PM

Allu Arjun Reacts Social Media Trolls Latest Fans Meet

హీరో అల్లు అర్జున్ ప్రతి ఏడాది నిర్వహించే ఫ్యాన్స్ మీట్.. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాడు. అభిమానులతో కలిసి ముచ్చటించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రోల్స్ గురించి తమని విమర్శించే వారి గురించి స్పందించాడు. నచ్చలేదా వదిలేయ్ అని చెప్పుకొచ్చాడు.

'టైమ్ అనుకోండి ఎనర్జీ అనుకోండి ఏమైనా అనుకోండి. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ప్రతిరోజు మనం 100 శాతం ఛార్జింగ్ అవుతాం. అదే రోజు ఆ ఛార్జింగ్ అంతా అయిపోతుంది. దీనిని నువ్వు ఏమైనా అనుకో. నువ్వు అది దేనికి వాడతావ్ అనేది నీ ఇష్టం. ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మీ సమయం, ఎనర్జీని మీకు నచ్చిన పనిపైనే పెట్టండి. నచ్చని విషయాల కోసం ఒక్క శాతం ఖర్చు పెట్టొద్దు. నచ్చలేదా వదిలేయ్. కనీసం నీకు నచ్చిన అమ్మాయి ఇంటి బయట నిల్చో. కనీసం నువ్వైనా ఎంజాయ్ చేస్తావు' అని అల్లు అర్జున్ చెప్పాడు.

'పుష్ప' సినిమాల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న బన్నీ.. తమిళ స్టార్ దర్శకుడు ‍అట్లీతో 'రాకా' చేస్తున్నాడు. అలానే లోకేశ్ కనగరాజ్‌తో మరో మూవీ చేస్తున్నాడు. ఇవి వచ్చే ఏడాది లేదంటే 2028లో థియేటర్లలోకి రావొచ్చు.

ఫ్యాన్స్ మీట్ లో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement