అఫిషియల్‌ : నెలలోలోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్‌’ | Rao Bahadur Movie OTT Release Date Details | Sakshi
Sakshi News home page

అఫిషియల్‌ : నెలలోలోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్‌’

Jul 28 2026 12:29 PM | Updated on Jul 28 2026 12:55 PM

Rao Bahadur Movie OTT Release Date Details

సత్యదేవ్‌ కలల ప్రాజెక్టు, ఎంతో కష్టపడి నటించిన చిత్రం ‘రావు బహదూర్‌’. వెంకట్‌ మాహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మిక్స్‌డ్‌ టాక్‌ సంపాదించుకుంది. సత్యదేవ్‌ నటనపై ప్రతిఒక్కరు ప్రశంసలు కురిపించారు కానీ.. కథ, కథనంపై మాత్రం పెదవి విరిచారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఈచిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 

థియేటర్స్‌లో రిలీజై నెల కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఎక్స్‌ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ బాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.

కథేంటంటే...
1991 నేపథ్యంలో ఈ కథనం సాగుతుది. భువన వంశానికి చెందిన రామప్పరావు బహదూర్ అలియాస్ రాముడు(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ బారిన పడతాడు. నాలుగు నెలలకు మించి బతకడని ఓ డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు గానీ ఏడాది దాటిపోయినా సరే రామప్ప అలానే ఉంటాడు. పైపెచ్చు రోజూ తాగుతూ బతికేస్తుంటాడు. నిద్రలో నుంచి లేచి అ‍ప్పుడప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు.

 ఇలా జరగడానికి కారణం ఎప్పుడో చనిపోయిన రామప్ప చిన్న కొడుకు కుసుమప్ప. వీడు తనకు పుట్టలేదని రామప్ప 'అనుమానం'. ఇదే విషయాన్ని చెబుతూ తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పల) బుర్ర తినేస్తూ ఉంటాడు. మరి రావు బహదూర్ అనుమానం నిజమేనా? కుసుమప్ప ఎందుకు ఎలా చనిపోయాడు? ఈ కథలో రామప్ప భార్య రేణుక (దీపా థామస్) సంగతేంటి? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement