breaking news
Rao Bahadur Movie
-
'తొలిసారి ఆ మాటలు విన్నా'.. రావు బహదూర్ హీరోయిన్ ఎమోషనల్
సత్యదేవ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ రావు బహదూర్. ఈ నెల 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జంటగా దీపా థామస్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీకి కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సక్కెస్ టాక్ రావడంతో మేకర్స్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. హైదరాబాద్‌లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హీరోయిన్ దీపా థామస్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా హీరోయిన్ భావోద్వేగానికి గురైంది. ఈ సినిమా చూసిన మా నాన్న తనను పొగిడారంటూ ఎమోషనలైంది. నా కెరీర్లో తొలిసారి అలాంటి మాటలు విన్నానని ఏడ్చేసింది. నేను కూడా ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశా. వారి రెస్పాన్స్ చూసి ఎమోషనలయ్యా అంటూ రావు బహదూర్ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.దీపా థామస్ మాట్లాడుతూ..' నా పేరేంట్స్‌కు తెలుగు రాదు. వాళ్లు ఈ సినిమాని సబ్‌టైటిల్స్‌తో చూశారు. ఈ సినిమా చూసి మా నాన్న చెప్పారు. ఇంకా బాగా చేయాలని తొలిసారి నాన్న నాతో అన్నారు. ఇదే నా కెరీర్లో అత్యంత గొప్ప ప్రశంస. మన వీక్ పాయింట్ ఎవరికీ తెలియొద్దని మహాగారు చెప్పారు. అందుకే ఈరోజు నేను ఏడావలనుకోవడం లేదు' అంటూ ఫుల్ ఎమోషనలైంది. స్టేజీపై మాట్లాడుతూ దీపా థామస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.దీపా థామస్ కెరీర్..కేరళకు చెందిన దీపా థామస్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. రావు బహదూర్‌తో గ్రాండ్ సక్సెస్ కొట్టేసింది. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మొదట మిస్ మిలీనియల్ అందాల పోటీలో టాప్ 10లో నిలిచింది. ఆ తర్వాత మిస్ సౌత్ ఇండియా పోటీలో సెకండ్ రన్నరప్ టైటిల్ గెలుచుకుంది. అలా రాక్ పేపర్ సీజర్స్ అనే వెబ్‌సిరీస్‌తో సినీ కెరీర్ ప్రారంభించింది. వైరస్ అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. 'హోమ్' సినిమాతో ఫేమస్ అయింది. మలయాళంలో పలు సినిమాలు చేసిన దీపా థామస్ తెలుగులో రావు బహదూర్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. -
అది నాకు కొత్త కాదు.. సహజీవనం చేస్తుంటా: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ రావు బహదూర్. ఈ నెల 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జంటగా దీపా థామస్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీకి కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు–నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్టైన్ మెంట్ సమర్పణలో ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు.ఈనెల 3న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. హిట్ టాక్ రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హాజరైన సత్యదేవ్ తన సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తన మూవీస్ చాలా నిరాశ పరిచాయని అన్నారు. రావు బహదూర్ లాంటి గొప్ప సినిమాను చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సత్యదేవ్ మాట్లాడుతూ..' గతంలో నా సినిమాలు వచ్చినప్పుడు .. ఇది వర్కవుట్ అవుతుందని చెప్పేవారు. అంతేకాదు ఈ మూవీ హిట్ అయితే మీరు ఓఆర్ఆర్ వద్ద ఓ పది ఎకరాలు కొనొచ్చు అనేవారు. నాకు డిసప్పాయింట్మెంట్ అనేది కొత్త కాదు. దాంతో నేను, మహా సహజీవనం చేస్తుంటాం. సక్సెస్ అనేది కొత్త. ఈ రోజు సక్సెస్ వచ్చింది అనే పాయింట్ కంటే.. ఈ సినిమా జనాలు చూడకపోతే ఒక గొప్ప చిత్రాన్ని కోల్పోతారనే ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీ జనాలు చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. -
నాగబంధం vs రావు బహదూర్.. ఎవరికి ఎన్ని కోట్లు వచ్చాయ్?
ఈ వీకెండ్ భారీ బడ్జెట్ సినిమాలు కానప్పటికీ ఓ మాదిరి హైప్‌తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలోకి నాగబంధం, రావు బహదూర్ చిత్రాలు వచ్చాయి. రెండు వేర్వేరు జానర్ మూవీస్ కావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించారు. అందుకు తగ్గట్లే ఒకటి గ్రాఫిక్స్ పరంగా ఆకట్టుకోగా.. మరొకటి చిత్రమైన కాన్సెప్ట్‌తో వచ్చింది. మరి వీటికి తొలిరోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయ్?విరాటకర్ణ, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా చేసిన 'నాగబంధం' సినిమాని బ్రహ్మకమలం, అనంత పద్మనాభి స్వామి నిధి, సనాతన ధర్మం తదితర అంశాలతో తెరకెక్కించారు. స్టోరీ పరంగా వీక్ అనే టాక్ వినిపిస్తున్నప్పటికీ మూడు గంటలకు పైగా నిడివితో ప్రతి ఫ్రేమ్‌లో గ్రాఫిక్స్‌తో భారీతనం కనిపించిందని చూసినవాళ్లు అంటున్నారు. ఇక ఈ చిత్రానికి తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.3.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇకపోతే సత్యదేవ్ హీరోగా, వెంకటేశ్ మహా దర్శకత్వం వచ్చిన సినిమా 'రావు బహదూర్'. 1968, 1991 కాలంలో ఓ రాజ వంశానికి చెందిన ఓ వ్యక్తి జీవితం ఆధారంగా తీసిన కల్పిత కథ ఇది. అనుమానం పెనుభూతం అనే అంశాన్ని మేజర్‌గా తీసుకున్నప్పటికీ సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో టీమ్ విఫలమైంది. చాలా బుర్రపెట్టి చూస్తే తప్పితే ఈ చిత్రం అర్థం కాని పరిస్థితి. ఇక ఈ సినిమాకు తొలిరోజు రూ.3.9 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు.(ఇదీ చదవండి: 'రావు బహదూర్' సినిమా రివ్యూ) -
'రావు బహదూర్' సినిమా రివ్యూ
'వారణాసి'తో బిజీగా ఉన్న మహేశ్ బాబు.. ఓ నిర్మాతగా చేసిన సినిమా 'రావు బహదూర్'. సత్యదేవ్ హీరోగా నటించగా.. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వం వహించాడు. ప్రమోషన్లు, సత్యదేవ్ లుక్స్ కారణంగా ఈ చిత్రంపై కాస్తంత బజ్ ఏర్పడింది. అలా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)కథేంటి?అది 1991. భువన వంశానికి చెందిన రామప్పరావు బహదూర్ అలియాస్ రాముడు(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ బారిన పడతాడు. నాలుగు నెలలకు మించి బతకడని ఓ డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు గానీ ఏడాది దాటిపోయినా సరే రామప్ప అలానే ఉంటాడు. పైపెచ్చు రోజూ తాగుతూ బతికేస్తుంటాడు. నిద్రలో నుంచి లేచి అప్పుడప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఇలా జరగడానికి కారణం ఎప్పుడో చనిపోయిన రామప్ప చిన్న కొడుకు కుసుమప్ప. వీడు తనకు పుట్టలేదని రామప్ప 'అనుమానం'. ఇదే విషయాన్ని చెబుతూ తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పల) బుర్ర తినేస్తూ ఉంటాడు. మరి రావు బహదూర్ అనుమానం నిజమేనా? కుసుమప్ప ఎందుకు ఎలా చనిపోయాడు? ఈ కథలో రామప్ప భార్య రేణుక (దీపా థామస్) సంగతేంటి? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఎలాంటి కథ తీసుకున్నా చివరకు ఎలాంటి ట్విస్టులు పెట్టినా ప్రెజెంటేషన్ ఎలా ఉందనేది కూడా కీలకం. ఎందుకంటే అద్భుతమైన ట్విస్టులు పెట్టినా సరే దానికి తగ్గ కథకథానాలు లేదంటే క్లైమాక్స్‌లో పెద్దగా ఇంపాక్ట్ అనిపించదు. 'రావు బహదూర్' విషయంలో సరిగ్గా అదే జరిగింది. తెర నిండా భారీతనం, సత్యదేవ్ చేసే డిఫరెంట్ యాక్టింగ్ బాగున్నప్పటికీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా లేకపోవడం దీనికి పెద్ద మైనస్.ఓ ఫొటో ఫ్రేమ్ నుంచి బయటకొచ్చిన ఓ పిల్లాడు వేగంగా పరుగెత్తే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. తర్వాత కాసేపటికే ప్రధాన పాత్రధారి రావు బహదూర్ ఎంటర్ అవుతాడు. ఇంతకీ అతడెవరు? అతడి ప్రపంచం ఏంటి? అని మెల్లగా చూపిస్తూ వెళ్తారు. తన జీవితాన్ని చెబితే రెండు భాగాల సినిమా అవుతుందని కూడా అంటాడు. కట్ చేస్తే రామప్ప యుక్త వయసుకి కథ వెళ్తుంది. దేశాలు పట్టుకు తిరుగుతున్న రామప్ప.. తండ్రి అనారోగ్యం కారణంగా ఇంటికి వస్తాడు. అదే టైంలో తండ్రిని చూసుకోవడానికి వచ్చిన నర్స్ రేణుకతో ప్రేమలో పడతాడు. తర్వాత వీళ్ల పెళ్లి, వైవాహిక జీవితం ఎలా సాగింది? రావు బహదూర్‌కి వచ్చిన అనుమానం.. పెనుభూతంలా మారి అతడి జీవితాన్ని ఎలా నాశనం చేసిందనేది మిగతా స్టోరీ.ఫస్టాప్ చాలా అంటే చాలా నెమ్మదిగా నిదానంగా సాగుతూ ఉంటుంది. డ్రామా మరీ ఎక్కువైపోయింది. ఏదో జరుగుతుంది అని తెలుస్తూ ఉంటుంది గానీ అసలు సంగతి ఏంటనేది మాత్రం అంతుపట్టదు. చెప్పాలంటే సహనాన్ని చాలా పరీక్షిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి ఫస్టాప్‌తో పోలిస్తే కాస్త బెటర్ అనిపిస్తుంది. సెటైరికల్ కామెడీ కొన్నిచోట్ల వర్కౌట్ కూడా అయింది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? ఏం చూపించాలనుకున్నాడో ఇంటర్వెల్ తర్వాతే తెలుస్తుంది. చివరికొచ్చేసరికి ఊహించని ట్విస్టులతో ముగుస్తుంది.అయితే ఇదే దర్శకుడు గతంలో 'కేరాఫ్ కంచరపాలెం' తీశాడు. ఇందులో సినిమా అంతా సరదసరదాగా ఉంటూ చివరలో షాకిచ్చే ట్విస్ట్ వస్తుంది. ఇందులో కూడా అదే పద్ధతి ఫాలో అయ్యారు. కాకపోతే క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా గానీ అప్పటివరకు ఉంటే స్టోరీ అంతా సోసోగా ఉంటుంది. పెద్దగా ఎంటర్టైన్ చేయదు. నిడివి కూడా చాలా ఎక్కువ. పేరుకే 2 గంటల 50 నిమిషాల నిడివి కానీ ఏదో నాలుగైదు గంటల మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ లాంటివి బాగున్నప్పటికీ ఎమోషన్ సరిగా పండకపోవడం పెద్ద మైనస్. రావు బహదూర్ పాత్రతో పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోతాం.అయితే ఈ మూవీలో ఏదైనా మెచ్చుకోవాల్సిన విషయం ఉందంటే అది సత్యదేవ్ నటన. ఎందుకంటే చూస్తున్నంతసేపు రావు బహదూర్ పాత్రకు జీవం పోశాడా అనిపిస్తుంది. చిత్రమైన హావభావాలు, అప్పటికప్పుడు మార్చే ఎమోషన్స్ వెరైటీగా అనిపిస్తాయి. ఇతడి ఇంట్లో పనిమనిషిగా చేసిన మహిళ పాత్ర నవ్విస్తుంది. ఫ్రెండ్ ఆచారిగా చేసిన వికాస్ ముప్పల ఆకట్టుకున్నారు. రావు బహదూర్ భార్య రేణుకగా చేసిన దీపా థామస్.. ఫస్టాప్‌లో కనిపిస్తుంది. ఇంప్రెసివ్గాా అనిపిస్తుంది. కానీ మళ్లీ క్లైమాక్స్‌లో దర్శనమిస్తుంది. మధ్యలో అస్సలు కనిపించదు.ఇక రైటర్, డైరెక్టర్ వెంకటేశ్ మహా విషయానికొస్తే.. తెలుగులో ఇప్పటివరకు రానటువంటి డిఫరెంట్ యాక్టింగ్, విజువల్‌తో మెస్మరైజ్ చేద్దామనుకున్నాడు. అందుకు తగ్గట్లే చాలానే కష్టపడ్డాడు కూడా. కానీ ఎందుకనో అది పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదనిపించింది. ఇందులో రావు బహదూర్ ముత్తాత తాతకు తాత పాత్రలో వెంకటేశ్ మహా.. చిన్నపాటి అతిథి పాత్రలోనూ కనిపిస్తాడు. స్టెప్పులు కూడా వేస్తాడు. ఓవరాల్‌గా చూసుకుంటే 'రావు బహదూర్' చాలా కష్టపడి తీసిన సినిమా, కాకపోతే 'ఓకే' అనిపించే దగ్గరే ఆగిపోయింది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ) -
నా కెరీర్లో ఓ మైలురాయి: సత్యదేవ్
సత్యదేవ్, దీపా థామస్ జోడీగా నటించిన చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు–నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్టైన్ మెంట్ సమర్పణలో ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన ఈ మూవీ నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సత్యదేవ్ మాట్లాడుతూ–‘‘సైకలాజికల్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘రావు బహదూర్’. ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది. వంద శాతం విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని తెలిపారు.‘‘ఈ సినిమాకు ఎలాంటి రిఫరెన్స్ లేదు. నవ్విస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది’’ అని వెంకటేష్ మహా పేర్కొన్నారు. ‘‘ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా ఓపెన్ మైండ్‌తో మా సినిమాకు రావాలి.. సరికొత్త అనుభూతి కలుగుతుంది’’ అన్నారు అనురాగ్ రెడ్డి. ‘‘మా సినిమా చాలా కాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’’ అని శరత్ చంద్ర, గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. -
మహేశ్ నోట ‘సత్యదేవ్ ఇన్..’ వెలకట్టలేని మాట ఇది : సత్యదేవ్
మహేశ్ బాబు తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేశాను. కాకపోతే అందులో నా సీన్ కట్ అయింది. అలాంటి మహేశ్ బాబు నా సినిమా(రావు బహదూర్)కు వాయిస్ ఓవర్ ఇస్తూ ‘సత్యదేవ్ ఇన్...’ అని చెప్పగానే చాలా ఆనందంగా అనిపించింది. మహేశ్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ , ఆ మాట వెలకట్టలేనిది’ అని హీరో సత్యదేవ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సత్యదేవ్ మీడియాలో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ రావు బహదూర్ కంప్లీట్ సైకాలజికల్ డ్రామా. మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్‌జానర్స్‌గా ఉంటాయి. ఏదైనా మెటాఫర్‌ను విజువల్‌గా చేసి చూపించడం మ్యాజికల్ రియలిజం. కాకపోతే, కొన్నిసార్లు ఇది హారర్‌లా అనిపించవచ్చు. టీజర్లో మీరు వేర్లు వెంటాడుతున్న విజువల్ ఒకటి చూసి ఉంటారు. మీరు థియేటర్లో చూస్తున్నప్పుడు అది ప్రేక్షకులకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది.→ మేము సినిమా మొదలుపెట్టినప్పుడు ‘మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా’ అనే ట్యాగ్‌లైన్‌ను అనుకున్నాము. మహేశ్ బాబు ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ట్యాగ్‌లైన్ చెప్పారు. ఇప్పటివరకు సినిమా చూసిన ఫిలిం మేకర్స్ కూడా ‘మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా’ అని చెబుతున్నారు.→ మనం మామూలుగా చేసే సినిమాల కంటే 300 శాతం ఎక్కువగా ఈ సినిమాకు కష్టపడ్డాను. ఇందులో నా క్యారెక్టర్‌కు మేకప్ వేయడానికి ఐదు గంటలు పట్టేది, తీయడానికి గంటన్నర పట్టేది. ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా సహనం కావాలి.మేకప్ కంటే మైండ్ మేకప్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు అలాంటి మైండ్ మేకప్ చాలా చేశాను. ప్రతిరోజూ వెళ్లి 16 గంటలు పని చేయాలని ముందే నిర్ణయించుకునేవాడిని. అలా ప్రతిరోజూ హ్యాపీగా వెళ్లి ఎంజాయ్ చేస్తూ చేశాను.→ కమల్ హాసన్, సూర్య, విక్రమ్ లాంటి హీరోలు ఇలాంటి హెవీ మేకప్ సినిమాలు ప్రయత్నిస్తుంటారు. అది చూస్తున్నప్పుడు నేను కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా చేయాలని అనుకునేవాడిని. నేను యాక్టర్ అయినప్పటి నుంచి అది నా డ్రీమ్. ఆ అవకాశం 'రావు బహదూర్'తో వచ్చింది.→ రావు బహదూర్లోని రామప్ప క్యారెక్టర్‌కు ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. రామప్ప వెరీ మ్యాడ్ క్యారెక్టర్. ఈ సినిమా చూసిన తర్వాత రామప్పలా చేయాలి అని ఒక రిఫరెన్స్ పాయింట్ ఏర్పడుతుంది.ఈ సినిమా చేస్తున్నప్పుడు రామప్ప క్యారెక్టర్ నన్ను ఆవహించాడేమో అన్నట్టుగా అనిపించింది. అంతలా ఆ పాత్రలో లీనమైపోయాను.→ ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో చాలా రిచ్ రైటింగ్, డీటైలింగ్ ఉంటుంది. వెంకటేశ్ మహా ప్రతి లేయర్‌ను చాలా అద్భుతంగా రాసుకున్నారు. అంతే అద్భుతంగా తీశారు. సినిమా రిపీట్‌గా చూసేలా ఉంటుంది.→ 1960–99 మధ్య జరిగే కథ. ఇందులో కథానాయకుడు దేశసంచారి. తను అలా సంచారం చేస్తూ మళ్లీ తన ప్యాలెస్ భువనాలయంకి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరం.→ ఈ సినిమా కోసం ఫిజికల్‌గా కొన్ని ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నాను. కానీ మెంటల్‌గా నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎందుకంటే సినిమా అంటే నాకు ఇష్టం. యాక్టర్‌గా దీన్ని నేను ఒక వర్క్‌లా చూడను. ప్రతిరోజూ నాకు నచ్చిన పని చేశాననే ఆనందం ఉంటుంది.→ ఆడియన్స్‌గా నన్ను నేను చూసుకుంటాను. నా నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎందుకు ఎదురు చూడాలి అనే ప్రశ్నను నాకు నేనే వేసుకుంటాను.→ మహేశ్ బాబు, నమ్రత కలిసి ఈ సినిమా చూశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సినిమా గురించి మాట్లాడారు. ఆయన టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే సుకుమార్ కూడా చూశారు. ఆయన కూడా మంచి రివ్యూ ఇచ్చారు. అందరూ కూడా ‘మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా’ అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది.→ కొత్త రకం సినిమాలు తమిళం, మలయాళం నుంచి వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. మన దగ్గర ఎందుకు ఇలాంటి కొత్త రకం సినిమాలు లేవని ఒక డిస్కషన్ నడుస్తుంటుంది. అలాంటి వారందరికీ ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఇది ఒక డిఫరెంట్ విజువల్ స్పెక్టాకిల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. ప్రేక్షకుడు పెట్టే టికెట్‌కు పూర్తి విలువ ఇచ్చే సినిమా.→ కొత్త సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘సమవర్తి’ సినిమా చేస్తున్నాను. ఇప్పటివరకు నేను చేయని సినిమా. అది ఒక ఫారెస్ట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఒక కామెడీ సినిమా కూడా చేస్తున్నాను. అలాగే 'ఫుల్ బాటిల్' లో మాస్ క్యారెక్టర్ కూడా చేస్తున్నాను. -
తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్ ‘రావు బహదూర్’
‘‘తెలుగు సినిమాకు మేము రాస్తున్న ప్రేమలేఖ ‘రావు బహదూర్’ సినిమా. మహేశ్ బాబుగారు కూడా ఈ సినిమా చూసి ‘ఇది తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్’ అని చెప్పారు’’ అని హీరో సత్యదేవ్ పేర్కొన్నారు. వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్, దీపా థామస్ జోడీగా నటించిన చిత్రం ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఎ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్ మెంట్స్‌పై చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన ఈ మూవీ ఈ నెల 3న విడుదలవుతోంది. కాగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘మోర్ దాన్ ఏ టీజర్’ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకు చిత్ర సమర్పకుడు, హీరో మహేశ్ బాబు అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మహేశ్ బాబుగారు ఒక సినిమాను ప్రజెంట్ చేస్తున్నారంటే కచ్చితంగా దానిపై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను మా చిత్రం అందుకుంటుందని మా నమ్మకం’’ అని పేర్కొన్నారు. వెంకటేష్ మహా మాట్లాడుతూ–‘‘తెలుగు సినిమా కిరీటంలో ‘రావు బహదూర్’ మరో కలికితురాయిగా నిలుస్తుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా చూసిన కొద్దీ మళ్లీ చూడాలనిపిస్తుంది’’ అన్నారు గోపాలకృష్ణా రెడ్డి. ‘‘మా సినిమాతో ప్రేక్షకులకు చాలా భిన్నమైన అనుభూతి కలుగుతుంది’’ అని నిర్మాత శరత్ చంద్ర పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాతో నా కల నెరవేరినట్టు అయింది’’ అన్నారు హీరోయిన్ దీప థామస్. -
సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. (ఫోటోలు)
-
రావు బహదూర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ రావు బహదూర్. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహంచారు. ఈ మూవీలో దీపా థామస్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాన్ని మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ మహేశ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ఈ ట్రైలర్ ట్రైలర్ చూస్తుంటే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మునుపెన్నడు చూడని తెలుగు సినిమా రావు బహదూర్ అంటూ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మహేశ్ బాబు. కాగా.. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతమందించారు. -
బాహుబలి, RRR రేంజ్ లో రావు బహదూర్..
-
మా సినిమా చూసి మహేశ్ బాబు ఆశ్చర్యపోయాడు
‘‘ఈ రోజుల్లో కొత్తదనం లేకుండా సినిమా చేయడం చాలా కష్టం. ఒక జానర్ హిట్టయిందని అదే తరహాలో మరో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతినివ్వాలనే సంకల్పంతో ‘రావు బహదూర్’ చిత్రాన్ని నిర్మించాం. మా మూవీ సమర్పకుడు హీరో మహేశ్‌బాబుగారు ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయారు. ఔట్పుట్ అద్భుతంగా వచ్చింది. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని ఆయన చెప్పడంతో సినిమా విజయంపై మాకు మరింత నమ్మకం పెరిగింది’’ అని నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. సత్యదేవ్, దీపా థామస్ జోడీగా నటించిన చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వంలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్పై చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం జూలై 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా చింతా గోపాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాతగా తెలుగులో ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు, యశోద, క, చిదంబరం’, తమిళంలో సముద్ర ఖనితో ‘తిరుమాణిక్యం’ చిత్రాలు చేశాను. ‘రావు బహదూర్’ కథను మొదట నమ్రతగారు విన్నారు. ఆమెకు చాలా నచ్చింది. రావు బహదూర్ పాత్రకు సత్యదేవ్ కరెక్ట్‌గా సరిపోయారు. భిన్నమైన సినిమాలు చేయాలనుకోవడం వల్లే అనురాగ్, శరత్, నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాం. కథ, సెట్స్, కాస్ట్యూమ్స్, నిర్మాణ విలువలు చూస్తే ‘బాహుబలి’ తరహా భారీ నిర్మాణ అనుభూతి కలుగుతుంది. మా సినిమా ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభవాన్ని, పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తుంది. ప్రస్తుతం నేను నిర్మించిన రెండు సినిమాల్లో ఒకటి వినాయక చవితికి, మరొకటి దసరాకు విడుదలవుతాయి’’ అని తెలిపారు. -
నా కెరీర్లోనే తొలిసారి డ్యాన్స్ చేశాను: సత్యదేవ్
‘‘రావు బహదూర్’లో నా కెరీర్లోనే తొలిసారి బాగా డ్యాన్స్ చేశాను. ఈ మూవీలో ఉన్న పాటల్లో ‘దేశ సంచారి’ సాంగ్‌లో డ్యాన్స్‌కి స్కోప్ ఉంది. ఇది సాల్సా స్టయిల్ డ్యాన్స్. ఇలాంటి డ్యాన్స్ చేయాలంటే పది, పదిహేనేళ్ల ప్రాక్టీస్ కావాలి. నాకెంతో ఓపికగా నేర్పించి, చేయించిన మా డ్యాన్స్ మాస్టర్‌కు థ్యాంక్స్’’ అని హీరో సత్యదేవ్ పేర్కొన్నారు. వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్, దీపా థామస్ జోడీగా నటించిన చిత్రం ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం జూలై 3న విడుదల కానుంది.స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘దేశ సంచారి..’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా హేమచంద్ర, ప్రియాంక గజానన్ పాడారు. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన ఏడు గెటప్స్‌లో రామప్ప గెటప్ నాకు చాలా ఇష్టమైనది ’’ అని చెప్పారు. వెంకటేష్ మహా మాట్లాడుతూ– ‘‘సత్య, నేను బ్రదర్స్‌లా ఉంటాం. మనం ఏం కోరుకుంటామో దాన్ని అద్భుతంగా తెరపై చూపించగలడు’’ అని పేర్కొన్నారు. అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో సత్యదేవ్‌గారు కనిపించే ఏడు గెటప్స్‌లో ప్రతి గెటప్‌కు ప్రత్యేకమైన లుక్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కుదిరింది’’ అన్నారు. -
‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సత్యదేవ్ సాహసం.. రావు బహదూర్ టీజర్ రిలీజ్
సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రావు బహదూర్. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. మహేశ్‌బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటైర్టెన్మెంట్స్ సమర్పణలో నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సత్యదేవ్ రోల్ చూస్తుంటే విభిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. డిఫరెంట్ లుక్స్‌లో సత్యదేవ్ అదరగొట్టేశారని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా ఉండనుందని టీజర్‌తోనే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
మహేశ్ తీసిన సినిమాపై 'పెద్ది' ఎఫెక్ట్
'వారణాసి' హీరోగా చేస్తున్న మహేశ్ బాబు నిర్మాతగానూ అడపాదడపా మూవీస్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అలా మహేశ్ సొంత నిర్మాణ సంస్థ తీసిన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్'. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వెంకటేశ్ మహా దర్శకత్వం వహించాడు. లెక్క ప్రకారం జూన్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు 'పెద్ది' ప్రభావంతో నెలపాటు వాయిదా వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా)మార్చిలో రావాల్సిన 'పెద్ది'.. ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఆ టైంకి పనులు పూర్తి కాకపోవడంతో జూన్ 4కి వాయిదా పడింది. ఈ మేరకు పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఓవర్సీస్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఈ తేదీకి వస్తామని అనుకున్న సత్యదేవ్ 'రావు బహదూర్' సినిమాని జూలై 3న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య తదితర సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటేశ్ మహా దీన్ని తెరకెక్కించారు. సత్యదేవ్ హీరోగా నటించాడు. గతేడాది ఆగస్టులోనే టీజర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా అనిపించింది.జీఎంబీ ఎంటర్టైన్మెంట్, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఓ రాజవంశం నేపథ్యంలో సాగే ఈ సినిమాని సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన టాలీవుడ్ ప్రముఖులు) -
'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా
ప్రస్తుతం 'వారణాసి' సినిమాతో మహేశ్ బాబు బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ తొలి వారంలో ఇది థియేటర్లలోకి రానుంది. కానీ ఇంతకంటే ముందే మహేశ్ ఓ మూవీతో రాబోతున్నాడు. కాకపోతే ఇది ఈయన నటించిన చిత్రం కాదు నిర్మాతగా వ్యవహరించినది. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు)కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య తదితర సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటేశ్ మహా తీసిన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్'. సత్యదేవ్ హీరోగా నటించాడు. గతేడాది ఆగస్టులోనే టీజర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా అనిపించింది. కొన్నిరోజుల క్రితం తొలి పాట రిలీజ్ చేశారు. ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 5న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ వదిలారు.జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేశ్‌బాబు, నమ్రత.. ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలపై చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్చంద్ర నిర్మిస్తున్నారు. ఓ రాజవంశం నేపథ్యంలో సాగే ఈ సినిమాని సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రాకాస.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది) View this post on Instagram A post shared by GMB Entertainment (@gmbents) -
మహేశ్‌బాబు బ్యానర్ సినిమా ‘రావు బహదూర్’.. సాంగ్ ఈవెంట్ (ఫోటోలు)
-
రావు బహదూర్ మూవీ.. ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ హీరో సత్యదేవ్ నటిస్తోన్న తాజా చిత్రం రావు బహదూర్. ఈ సినిమాలో దీపా థామస్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో.. ఏప్లస్ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఓ సుందరి అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. ఈ పాటకు రెహమాన్ లిరిక్స్ అందిచగా.. విజయ్ యేసుదాస్ ఆలపించారు. ఈ పాటను స్మరణ్ సాయి కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రావు బహదూర్ చిత్రం ఈ ఏడాది సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


