'వారణాసి' హీరోగా చేస్తున్న మహేశ్ బాబు నిర్మాతగానూ అడపాదడపా మూవీస్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అలా మహేశ్ సొంత నిర్మాణ సంస్థ తీసిన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్'. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వెంకటేశ్ మహా దర్శకత్వం వహించాడు. లెక్క ప్రకారం జూన్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు 'పెద్ది' ప్రభావంతో నెలపాటు వాయిదా వేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా)
మార్చిలో రావాల్సిన 'పెద్ది'.. ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఆ టైంకి పనులు పూర్తి కాకపోవడంతో జూన్ 4కి వాయిదా పడింది. ఈ మేరకు పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఓవర్సీస్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఈ తేదీకి వస్తామని అనుకున్న సత్యదేవ్ 'రావు బహదూర్' సినిమాని జూలై 3న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య తదితర సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటేశ్ మహా దీన్ని తెరకెక్కించారు. సత్యదేవ్ హీరోగా నటించాడు. గతేడాది ఆగస్టులోనే టీజర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా అనిపించింది.జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఓ రాజవంశం నేపథ్యంలో సాగే ఈ సినిమాని సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్‌మెంట్.. ఆశీర్వదించిన టాలీవుడ్ ప్రముఖులు)


