మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్‌మెంట్.. ఆశీర్వదించిన చిరు | Meher Ramesh Daughter Engagement Chiranjeevi Attend | Sakshi
Sakshi News home page

Meher Ramesh Daughter: కూతురి నిశ్చితార్థం.. వీడియో పోస్ట్

May 8 2026 5:44 PM | Updated on May 11 2026 2:04 PM

Meher Ramesh Daughter Engagement Chiranjeevi Attend

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో శుభకార్యం జరిగింది. గత నెల 26న ఈయన కుమార్తె మోహన నిశ్చితార్థం జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియోని ఈ డైరెక్టర్ ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి-సురేఖ, శ్రీకాంత్, సునీల్, నమ్రత-సితార, కేటీఆర్, వెంకటేశ్, వివి వినాయక్ తదితరులు హాజరై కాబోయే వధూవరులని దీవించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా)

చిరంజీవికి దగ్గర బంధువైన మెహర్ రమేశ్.. పూరీ జగన్నాథ్ దగ్గర తొలుత దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఆ టైంలోనే అంటే 2002లో రిలీజైన 'బాబీ' సినిమాలో నటించారు కూడా. ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా'ని కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో 'వీర కన్నడిగ' అని తీసి దర్శకుడిగా పరిచమయ్యారు. మహేశ్ 'ఒక్కడు'ని 'అజయ్' పేరుతో కన్నడలో రీమేక్ చేసి మరో సూపర్ హిట్ కొట్టారు.

అయితే ఎన్టీఆర్ 'కంత్రి'తో తెలుగులోకి మెహర్ రమేశ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత చేసిన శక్తి, షాడో, భోళా శంకర్ కూడా ఒకదానికి మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్‌తో తీసిన 'బిల్లా' మాత్రం ఉన్నంతలో ఈయనకు పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతానికైతే కొత్తగా ఏం సినిమా చేస్తున్నట్లు లేదు. ఇప్పుడు ఒక్కగానొక్క కుమార్తె మోహనని అనిరుధ్ అనే కుర్రాడితో నిశ్చితార్థం చేసి శుభవార్త చెప్పారు. ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా ఉండొచ్చు.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అషురెడ్డి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement