నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అషురెడ్డి | Actress Ashu Reddy Engagement Latest News | Sakshi
Sakshi News home page

Ashu Reddy: అషురెడ్డి ఎంగేజ్‌మెంట్.. ఎవరా అబ్బాయి?

May 8 2026 4:20 PM | Updated on May 8 2026 5:18 PM

Actress Ashu Reddy Engagement Latest News

బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి నిశ్చితార్థం చేసుకుని పెద్ద షాకిచ్చింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఓ కేసు కోర్టులో ఉంది. లండన్‌కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారైని మోసం చేసి రూ.9.5 కోట్లు తీసుకుందనే ఆరోపణలు ఈమెపై వచ్చాయి. ఈ వివాదం అలా ఉండగానే ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఆ ఫొటోలని అషు తన సోషల్ మీడియాలో పంచుకుంది.

(ఇదీ చదవండి: ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె?)

వైజాగ్‌కి చెందిన కొయ్య వెంకట అశ్విని రెడ్డి అలియాస్ అషురెడ్డి.. తొలుత సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం బిగ్‌బాస్ 3వ సీజన్‌లో పాల్గొని బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించింది. అయితే దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన ఒకటి రెండు వీడియోలతో ఈమె చాలా విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ క్రేజ్ బాగానే వచ్చింది.

కొన్నిరోజుల క్రితం ధర్మేంద్ర అనే ఎన్నారై తండ్రి సత్యనారాయణ.. అషురెడ్డి ఈమె కుటుంబంపై హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో తన కొడుకుని అషు మోసం చేసిందని, రూ.9.5 కోట్ల రూపాయలు తీసుకుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అషు.. హైకోర్టుని ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని, పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో పోలీసుల విచారణ ముమ్మరమైంది.

ఇదంతా జరగుతుండగానే అషుకి సంబంధించిన ఓ ఆడియో బయటకొచ్చింది. ఇందులో సెటిల్ చేసుకుందామని అషు అన్నట్లు ఉంది. తర్వాత ధర్మేంద్ర ఆడియో కూడా బయటకొచ్చింది. ఇప్పుడు అషురెడ్డి సడన్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు ఫొటోలు రిలీజ్ చేయడంతో ఎవరా కుర్రాడు అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఈమెకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 41A నోటీసులు జారీ చేసి షాకిచ్చారు. అషురెడ్డితోపాటు ఆమె తల్లిదండ్రులు.. సోమవారం విచారణకు హాజరవ్వాలని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement