ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా | Barabar Premistha Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT:‍ తెలుగు రొమాంటిక్ సినిమా.. ఓటీటీలో సడన్ స్ట్రీమింగ్

May 8 2026 4:02 PM | Updated on May 8 2026 4:16 PM

Barabar Premistha Movie OTT Streaming Now

టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.. చిత్రమైన మేనరిజంతో యాటిట్యూడ్ స్టార్‌గా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 'రామ్‌నగర్ బన్నీ' అనే సినిమాతో కొన్నాళ్ల క్రితం హీరోగా పరిచయం కాగా అది ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో ఈసారి విలేజ్ రొమాంటిక్ మూవీతో ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చాడు. దీన్ని జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఏ మాత్రం సౌండ్ చేయకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

చంద్రహాస్, మేఘనా ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. ఈ చిత్ర ప్రమోషన్లలో 'గుంజి గుంజి' అనే బూతు పాట పాడిన చంద్రహాస్.. ఓ జర్నలిస్టుతో సోషల్ మీడియా వేదికగా గొడవపడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నాడు. అలా ఈ మూవీ వార్తల్లో నిలచింది. కానీ ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైతే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.

'బరాబర్ ప్రేమిస్తా' విషయానికొస్తే.. రుద్రారం అనే ఊరిలో ధర్మాని, కర్మాని అనే రెండు కులాలు ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా వీళ్లకు పడదు. ఎప్పుడూ గొడవలే. ఇదే గ్రామానికి చెందిన చందు(చంద్రహాస్), బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ) ప్రేమించుకుంటారు. బుజ్జమ్మ తండ్రి సర్పంచ్ కాగా చందు తండ్రి సర్పంచ్‌గా ఓడిపోతూ ఉంటారు. ప్రారంభంలో చందు- బుజ్జమ్మ కొట్టుకుంటారు కానీ తర్వాత ప్రేమించుకుంటారు. ఇదే ఊళ్ళో ఉంటే పెళ్లి జరగదు అని ఇద్దరూ లేచిపోయి కేరళ వెళ్తారు. మరి చందు – బుజ్జమ్మ కేరళలో పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ రుద్రారంకు ఎందుకు తిరిగి వస్తారు? రెండు కులాల వాళ్ళు కలుస్తారా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement