ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ | Upcoming OTT Movies Telugu Release May Second Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 10 మూవీస్.. మరి థియేటర్లలో?

May 4 2026 8:54 AM | Updated on May 4 2026 9:09 AM

Upcoming OTT Movies Telugu Release May Second Week 2026

మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా థియేటర్లలోకి చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. ఉన్నంతలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన 'సతీ లీలావతి', రవిబాబు 'రేజర్', సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన', స్పిరిట్ అనే తెలుగు చిత్రాలతో పాటు రిషభ్ శెట్టి హీరోగా చేసిన 'ఏ ఫిల్మ్ బై గిరి' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)

సతీ లీలావతి: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ట్రైలర్ బాగానే ఉంది.

రేజర్: రవిబాబు దర్శకత్వం వహించి హీరోగా నటించిన సినిమా. ఈసారి రవిబాబు రక్తపాతాన్ని నమ్ముకున్నాడు. ఫలితం ఏమవుతుందో?

గోదారి గట్టుపైన: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోహీరోయిన్లుగా నటించారు. సుభాష్ చంద్ర దర్శకుడు. విలేజీ లవ్ స్టోరీగా దీన్ని తీశారు.

స్పిరిట్: రైతు దంపతులు నర్సమ్మ, వెంకటేశ్వర్లు కలిసి నిర్మించిన లేటెస్ట్ సోషల్ డ్రామా సినిమా ఇది. సీహెచ్ రవీంద్రనాథ్ దర్శకుడు.

ఏ ఫిల్మ్ బై గిరి: రిషభ్ శెట్టి హీరోగా నటించిన కామెడీ సినిమా ఇది. కరణ్ అనంత్, అనిరుధ్ మహేష్ దర్శకత్వం వహించారు. ఇందర్ హీరోయిన్‌గా చేసింది.

మరోవైపు ఓటీటీల్లో చాలా తక్కువ సినిమాలే రిలీజ్ అవుతున్నప్పటికీ అందులో చూడదగ్గవే చాలా ఉన్నాయి. అడివి శేష్ 'డెకాయిట్', ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'తో పాటు రీసెంట్ మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ 'వాలా 2'.. ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 04 నుంచి 10వ తేదీ వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • భరతనాట్యం 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08

అమెజాన్ ప్రైమ్

  • లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 06

  • సిటాడెల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 06

  • డెకాయిట్ (తెలుగు మూవీ) - మే 08

  • లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 08

హాట్‌స్టార్

  • వాలా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08

  • సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ) - మే 08

జీ5

  • లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ సినిమా) - మే 08

సన్ నెక్స్ట్

  • ఓ బటర్ ఫ్లై (తమిళ మూవీ) - మే 08

  • సూపర్ హిట్ (కన్నడ సినిమా) - మే 08

(ఇదీ చదవండి: ఒకప్పుడు సల్మాన్ హీరోయిన్.. ఇప్పుడేమో టిఫిన్ సెంటర్ నడుపుతూ)

Advertisement
 
Advertisement
Advertisement