Vaazha II: Biopic of a Billion Bros
-
ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా థియేటర్లలోకి చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. ఉన్నంతలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన 'సతీ లీలావతి', రవిబాబు 'రేజర్', సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన', స్పిరిట్ అనే తెలుగు చిత్రాలతో పాటు రిషభ్ శెట్టి హీరోగా చేసిన 'ఏ ఫిల్మ్ బై గిరి' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)సతీ లీలావతి: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్కు తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ట్రైలర్ బాగానే ఉంది.రేజర్: రవిబాబు దర్శకత్వం వహించి హీరోగా నటించిన సినిమా. ఈసారి రవిబాబు రక్తపాతాన్ని నమ్ముకున్నాడు. ఫలితం ఏమవుతుందో?గోదారి గట్టుపైన: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోహీరోయిన్లుగా నటించారు. సుభాష్ చంద్ర దర్శకుడు. విలేజీ లవ్ స్టోరీగా దీన్ని తీశారు.స్పిరిట్: రైతు దంపతులు నర్సమ్మ, వెంకటేశ్వర్లు కలిసి నిర్మించిన లేటెస్ట్ సోషల్ డ్రామా సినిమా ఇది. సీహెచ్ రవీంద్రనాథ్ దర్శకుడు.ఏ ఫిల్మ్ బై గిరి: రిషభ్ శెట్టి హీరోగా నటించిన కామెడీ సినిమా ఇది. కరణ్ అనంత్, అనిరుధ్ మహేష్ దర్శకత్వం వహించారు. ఇందర్ హీరోయిన్గా చేసింది.మరోవైపు ఓటీటీల్లో చాలా తక్కువ సినిమాలే రిలీజ్ అవుతున్నప్పటికీ అందులో చూడదగ్గవే చాలా ఉన్నాయి. అడివి శేష్ 'డెకాయిట్', ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'తో పాటు రీసెంట్ మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ 'వాలా 2'.. ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 04 నుంచి 10వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్భరతనాట్యం 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08అమెజాన్ ప్రైమ్లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 06సిటాడెల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 06డెకాయిట్ (తెలుగు మూవీ) - మే 08లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 08హాట్స్టార్వాలా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ) - మే 08జీ5లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ సినిమా) - మే 08సన్ నెక్స్ట్ఓ బటర్ ఫ్లై (తమిళ మూవీ) - మే 08సూపర్ హిట్ (కన్నడ సినిమా) - మే 08(ఇదీ చదవండి: ఒకప్పుడు సల్మాన్ హీరోయిన్.. ఇప్పుడేమో టిఫిన్ సెంటర్ నడుపుతూ) -
ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళ సినిమాలకు తెలుగులోనూ బోలెడంత క్రేజ్ ఉంది. ఓటీటీల్లోకి రావడం లేటు చూసేస్తుంటారు. రీసెంట్ టైంలో 'సంభవం అధ్యాయం ఒన్ను' చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇలానే అదరగొట్టేందుకు మరో మూవీ రెడీ అయిపోయింది. గతవారం తెలుగులోనూ విడుదలైన ఓ స్కూల్ ఏజ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ గురించి ఇప్పుడు అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: సత్య 'జెట్లీ' సినిమా రివ్యూ)2024లో థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న 'వాలా' చిత్రానికి కొనసాగింపుగా.. 'వాలా 2' తీశారు. ఇన్ స్టాలో పాపులర్ అయిన కుర్రాళ్లు నలుగురిని లీడ్ రోల్స్‌గా పెట్టారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.200 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది.ఏప్రిల్ 2న మలయాళంలో రిలీజ్ కాగా.. ఏప్రిల్ 26న తెలుగులో విడుదలైంది. ఇప్పుడు వచ్చే శుక్రవారం(మే 08) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది. కామెడీ, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని మిస్ అవ్వొద్దు.'వాలా 2' విషయానికొస్తే.. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన హాషిర్, అలన్, అజిన్, వినాయక్ అనే నలుగురు కుర్రాళ్లని తల్లిదండ్రులు ఎన్నోకష్టాలు పడుతూ కాలేజీకి పంపుతుంటారు. కానీ వీళ్లు చదువుల్లో కంటే గొడవల్లోనే ముందుంటారు. గొడవల వల్ల ఓ దశలో కాలేజీ నుంచి బయటకు పంపించే పరిస్థితులు వస్తాయి. ఓ పోలీస్ ఆఫీసర్ (ఆల్ఫోన్స్ పుత్రన్) కలగజేసుకుని వీళ్లని కాపాడతాడు. ఆ తర్వాత పరీక్షలు రాసే అవకాశం వస్తుంది. ఉన్నత చదువుల కోసం, ఉపాధి కోసం యూకే వెళ్లాలనుకున్న ఈ నలుగురూ తమ కలని నిజం చేసుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్) -
‘వాలా 2 ’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: వాలా 2నటీనటులు:హషిర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, బిజు కుట్టన్, అజిన్ జాయ్, వినాయక్ వి తదితరులు నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్రచన: విపిన్ దాస్దర్శకత్వం: సావిన్ ఎస్ఏవిడుదల తేది: ఏప్రిల్ 24, 2026విభిన్నమైన కథాంశాలతో ప్రస్తుతం మలయాళం చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలుగులోనూ మలయాళ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ అయిన తాజా చిత్రమే వాలా 2. మలయాళంలో ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం అక్కడ ఇప్పటికే రూ. 210 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 24) తెలుగులో రిలీజైన ఈ మలయాళ బ్లాక్ బస్టర్ టాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. నలుగురు విలేజ్ కుర్రాళ్ల చుట్టూ తిరిగే కథ ఇది. మిడిల్ క్లాస్‌కు చెందిన హాషిర్, అలన్, వినాయక్, అజిన్ మంచి స్నేహితులు. తల్లిదండ్రులు కష్టపడి కాలేజీకి పంపిస్తే.. వాళ్లు మాత్రం అక్కడ చదువు మీదకంటే..అల్లరి పనులపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అమ్మాయిలకు సైట్ కొట్టడం.. గొడవలు..రోజు ఇదే పని. ఓ సారి ఈ అల్లరి హద్దు దాటి, డ్రగ్స్ సేవించి టీచర్‌పై చేయి చేసుకోవడం దాకా వెళ్తుంది. దీంతో ఈ నలుగురిని కాలేజీ నుంచి బయటకు పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. లోకస్ ఎస్సై (ఆల్ఫోన్స్ పుత్రన్) కలగజేసుకొని వీళ్లను కాపాడతాడు. ప్రిన్సిపల్‌తో మాట్లాడి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తాడు. సమాజం మాత్రం వీరిని లూజర్గానే చూస్తుంది. వీళ్లు మాత్రం ఎలాగైనా ఇంటర్ పాసై.. ఉన్నత చదువు కోసం, ఉపాది కోసం యూకే వెళ్లాలనుకుంటారు. మరి వీరి కల నెరవేరిందా? పరీక్షల్లో ఈ నలుగురూ పాసయ్యారా? యూకే వెళ్లిన అలన్, వినాయక్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? అజిన్ దుబాయ్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? హాషిర్ ఊర్లోనే ఎందుకు ఉండిపోయాడు? కళాశాల నుంచి బయటకు వచ్చాకా ఈ నలుగురి జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి? అన్నదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మలయాళ సినిమాలలో చాలా వరకు వాస్తవికానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఒక సింపుల్ పాయింట్ తీసుకొని..దానికి ఎమోషన్స్ జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కిస్తుంటారు. స్టార్స్ లేకున్నా..ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అలా తెరకెక్కిన మరో మలయాళ ఆణిముత్యమే ఈ వాలా 2. 2024లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘వాలా’కు కొనసాగింపు ఇది. ఆ సినిమా మాదిరే ఈ కథ కూడా కాలేజీ కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది. అయితే ఇక్కడ తోబుట్టువుల అనుబంధంతో పాటు విదేశాలకు వెళ్లిన యువతరం కష్టాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. వాలా మాదిరే ఈ చిత్రం కూడా ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతూ.. చివరిలో కన్నీళ్లను పెట్టిస్తుంది. ప్రేక్షకులు కథకు కనెక్ట్ అయి.. భావోద్వేగానికి గురయ్యేలా చేయడంతో దర్శకుడు సావిన్ ఎస్.ఏ, రచయిత విపిన్ దాస్ వందశాతం సక్సెస్ అయ్యారు.హాషిర్, అలన్ల బాల్యం సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. తమ్ముడు పుట్టిన తర్వాత హాషిర్, చెల్లి పుట్టిన తర్వాత అలన్ పడే ఇబ్బందులను కామెడీగా చూపించి.. కథను కాలేజీ టర్న్ చేశారు. అక్కడ స్నేహాలు.. ప్రేమలు, చిన్న చిన్న గొడవలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి కాలేజీ డేస్‌ని గుర్తుకు తెస్తాయి. ప్రస్తుతం కాలేజీ చదువుతున్న యువతకు అయితే ఈ నలుగురి పాత్రలను తమలోనో లేదా తమ స్నేహితుల్లోనూ చూసుకుంటారు. థియేటర్స్‌లో పోలీసు అధికారిపై వేసే పంచులు, ముజీబ్ సార్ ఎపిసోడ్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఫస్టాఫ్ అంతా ఇలా ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక సెకండాఫ్ మాత్రం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రథమార్థం ఎంత నవ్వులు పూయిస్తుందో.. ద్వితియార్థం అంత ఎమోషనల్‌కు గురి చేస్తుంది. మధ్యతరగతి యువత కష్టాలను, కెరీర్ టెన్షన్స్‌తో పాటు తోబుట్టువుల బంధం, పెరెంట్స్ పడే ఇబ్బందులను గుండెను పిండేసేలా చూపించారు. పతాక సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి.ఎవరెలా చేశారంటే.. ఇందులో నటించవారంతా కొత్తవాళ్లే. అయినా కూడా చక్కగా నటించారు. హాషిర్, అలెన్, అజిన్, వినాయక్ పాత్రలు మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. వీరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ప్రతిఒక్కరు చాలా సహజంగా నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, ఎడిటింగ్ బాగా కుదిరింది. డబ్బింగ్ కూడా చక్కగా కుదరడంతో ఇది మలయాళ సినిమా అనేదే మర్చిపోతాం.నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?
టాలీవుడ్ రేంజు పెరిగిపోయింది. అబ్బో పాన్ ఇండియా సినిమాలు తీసేస్తున్నాం అని చాలామంది సంబరపడిపోతున్నారు గానీ గ్రౌండ్ లెవల్ పరిస్థితి అస్సలు బాగోలేదు. మిగతా విషయాల్ని కాసేపు పక్కనబెడితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఒకటి రెండు సినిమాలు తప్పితే తర్వాత నుంచి వరసపెట్టి ఫ్లాపులే. కొన్ని చిత్రాలు యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోతున్నాయి. గత మూడు నెలలుగా టాలీవుడ్లో సరైన హిట్ లేదు. అలాంటిది మలయాళంలో మాత్రం చిన్న చిత్రాలు వరసపెట్టి వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నాయి? ఇంతకీ ఇదెలా సాధ్యం? వాళ్ల సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?(ఇదీ చదవండి: ఆరో క్లాస్ నుంచి చేస్తున్నా.. నా దగ్గర 1000 పాటలున్నాయి)ఒకప్పుడు మలయాళ సినిమా అంటే చిన్నచూపు ఉండేది కానీ గత కొన్నేళ్లుగా ఈ ఇండస్ట్రీకి రీచ్ బాగా పెరిగింది. లాక్డౌన్ తర్వాత అన్ని భాషల ప్రేక్షకులు ఈ భాష చిత్రాల్ని చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి తగ్గట్లే మలయాళీ దర్శకులు.. అందరరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్లతో సినిమాలు తీస్తున్నారు. గత నెలలో 'ధురంధర్ 2'తో పాటు రిలీజై 'ఆడు 3' అనే చిత్రం సెన్సేషన్ సృష్టించింది. రూ.100 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది. తాజాగా 'భరతనాట్యం 2', 'వాలా 2' అనే చాలా చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా వరసగా రూ.100, రూ.200 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాయి.తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో రీసెంట్ టైంలో సక్సెస్ కోసం అందరూ ఇబ్బంది పడుతుంటే మలయాళంలో మాత్రం వరస హిట్స్ కొడుతున్నారు. దీనికి కారణాలు ఏంటా అని చూస్తే చాలా సింపుల్. మలయాళీ దర్శకులు.. అనవసర ఆర్భాటాలు పేరిట గిమ్మిక్కులు చేయరు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఏళ్లకు ఏళ్లు మూవీస్ తీయరు. పరిమిత బడ్జెట్, తక్కువ వర్కింగ్ డేస్‌లో ఎలాంటి చిత్రాన్ని అయినా పూర్తి చేస్తారు. కథను నమ్మి, వైవిధ్యమైన ఐడియాలతో ప్రేక్షకులకు కొత్తదనం పంచాలని చూస్తారు. సహజమైన వాతావరణంలోనే ఎక్కువగా సినిమాలు తీయడం ఇంకో ప్లస్. అందుకే ఆ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయిమరోవైపు టాలీవుడ్ పరిస్థితి చూస్తే.. ఓటీటీ మార్కెట్ దారుణంగా పడిపోతూ వస్తోంది. దీంతో భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. కొందరు మిడ్ రేంజ్ హీరోలకు పెద్ద మార్కెట్ లేకపోయినా వీళ్లపై కొందరు నిర్మాతలు.. భారీతనం పేరిట, హంగులు, ఆర్భాటాల పేరిట కోట్లకు కోట్లు ఖర్చు చేసేస్తున్నారు. బిజినెస్ మాత్రం దానికి తగ్గట్లు జరగట్లేదు. సరేలే ఎలాగోలా కానిచ్చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తే.. చూసేందుకు ప్రేక్షకులు రావట్లేదు. వీటిలో ప్లానింగ్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.తెలుగు ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే కంటెంట్ కాకుండా పాన్ ఇండియా పేరిట గిమ్మిక్కులు చేద్దామని చాలామంది దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు. అలాంటివి పసిగట్టేస్తున్న ఆడియెన్స్.. సదరు సినిమాల్ని లైట్ తీసుకుంటున్నారు. అందుకే తెలుగు దర్శకులు ఇకపై కంటెంట్‌ని నమ్ముకుని మూవీస్ తీస్తే బెటర్. లేదంటే ముందుముందు పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. మలయాళం లాంటి పరభాషా చిత్రాలకు ఆదరణ పెరగడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా) -
రూ.200 కోట్ల మలయాళ బ్లాక్బాస్టర్.. తెలుగు ట్రైలర్ రిలీజ్
రెండున్నర వారాల క్రితం మలయాళంలో రిలీజై సెన్సేషన్ సృష్టిస్తున్న సినిమా 'వాలా 2'. స్కూల్ పిల్లల నేపథ్య కథతో కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కట్ చేస్తే ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులోనూ ఈ శుక్రవారం(ఏప్రిల్ 24) రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నాని చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓం శాంతి డిస్కో శాంతి.. దెయ్యాల్ని భయపెట్టే పిచ్చోళ్లు)ట్రైలర్ బట్టి చూస్తే నలుగురు స్టూడెంట్స్ జీవితాల్లో స్కూల్ లైఫ్ ఎలాంటి పాత్ర పోషించింది? చివరకు వాళ్లు ఏం తెలుసుకున్నారు? అనే విషయాల్ని కామెడీ, ఎమోషనల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 'సంక్రాంతికి చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్' తీసిన సాహు గారపాటి.. 'వాలా 2' నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. మలయాళంలో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం.. తెలుగులో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: అనసూయపై అసభ్యకర కంటెంట్.. మరో నిందితుడు అరెస్ట్)


