రెండున్నర వారాల క్రితం మలయాళంలో రిలీజై సెన్సేషన్ సృష్టిస్తున్న సినిమా 'వాలా 2'. స్కూల్ పిల్లల నేపథ్య కథతో కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కట్ చేస్తే ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులోనూ ఈ శుక్రవారం(ఏప్రిల్ 24) రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నాని చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓం శాంతి డిస్కో శాంతి.. దెయ్యాల్ని భయపెట్టే పిచ్చోళ్లు)
ట్రైలర్ బట్టి చూస్తే నలుగురు స్టూడెంట్స్ జీవితాల్లో స్కూల్ లైఫ్ ఎలాంటి పాత్ర పోషించింది? చివరకు వాళ్లు ఏం తెలుసుకున్నారు? అనే విషయాల్ని కామెడీ, ఎమోషనల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 'సంక్రాంతికి చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్' తీసిన సాహు గారపాటి.. 'వాలా 2' నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. మలయాళంలో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం.. తెలుగులో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: అనసూయపై అసభ్యకర కంటెంట్.. మరో నిందితుడు అరెస్ట్)


