అనసూయపై అసభ్యకర కంటెంట్.. మరో నిందితుడు అరెస్ట్ | one more person arrested in Anasuya Bharadwaj | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: అనసూయపై అసభ్యకర కంటెంట్.. మరో నిందితుడు అరెస్ట్

Apr 20 2026 4:10 PM | Updated on Apr 20 2026 4:17 PM

one more person arrested in Anasuya Bharadwaj

సామాజిక మాధ్యమాలలో టాలీవుడ్ నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌పై అసభ్యకర పోస్టులు పెడుతున్న నిందితుడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అనసూయ లక్ష్యంగా అసభ్యకరమైన సోషల్ మీడియా కంటెంట్‌ పోస్ట్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని దొరెపల్లి చంటి(30)గా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతను చంటిదొరెపల్లి అనే పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్ నిర్వహిస్తున్నారు.

కాగా..ఇటీవలే జనార్ధన్ అనే నిందితుడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన జనార్ధన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్‌ 23న  పలువురు  సోషల్‌ మీడియాలో తనపై పరువు నష్టం కలిగించే విధంగా, అశ్లీల వ్యాఖ్యలను పోస్ట్‌ చేసి.. అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేశారంటూ సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement