ఓం శాంతి డిస్కో శాంతి.. దెయ్యాల్ని భయపెట్టే పిచ్చోళ్లు | Om Shanthi Disco Shanthi Movie Announcement | Sakshi
Sakshi News home page

ఓం శాంతి డిస్కో శాంతి.. దెయ్యాల్ని భయపెట్టే పిచ్చోళ్లు

Apr 20 2026 4:07 PM | Updated on Apr 20 2026 4:14 PM

Om Shanthi Disco Shanthi Movie Announcement

ఆనందో బ్ర‌హ్మ‌, సేవ్ ది టైగ‌ర్స్ లాంటి సినిమా, సిరీస్ తీసిన మ‌హి వి.రాఘ‌వ్ నుంచి రాబోతున్న మ‌రో స‌రికొత్త కామెడీ హార‌ర్ మూవీ 'ఓం శాంతి డిస్కో శాంతి'. మరోసారి ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బా న‌వ్వించ‌టానికి ఎవ‌రూ ఊహించ‌ని స‌రికొత్త ట్విస్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దెయ్యాలు మ‌నుషుల్ని  భ‌య‌పెట్టాయి. కానీ ఆ దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే? అస‌లు భ‌యం అంటే తెలియ‌ని పిచ్చివాళ్లు ఈ దెయ్యాల ముందుకు వ‌స్తే.. దెయ్యాలు వ‌ర్సెస్ పిచ్చివాళ్లు మ‌ధ్య జ‌రిగే ఓ గంద‌ర‌గోళ‌మైన ఫుల్ ఫ‌న్ రైడర్ ఈ చిత్రం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)

దెయ్యాలు పిచ్చివాళ్ల‌ని భ‌య‌పెట్ట‌గ‌ల‌వా? లేదా పిచ్చివాళ్లే తిర‌గ‌బ‌డి దెయ్యాల్ని భ‌య‌పెడ‌తారా? జంప్ స్కేర్‌, ఫ‌న్నీ డైలాగ్స్‌, ఉహించ‌ని ట్విస్టులతో ఈ స్పూకీ ఫ‌న్ జ‌ర్నీ తెర‌కెక్కుతోంది. ఓం శాంతి డిస్కో శాంతి సినిమాని సెప్టెంబ‌ర్‌ 4న థియేటర్లలోకి తీసుకురానున్నారు.

(ఇదీ చదవండి: కుడివైపు గుండె.. నీలం రంగు శరీరం.. 'చిరంజీవి' గ్లింప్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement