మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రావట్లేదు. 'గేదెల రాజు' అనే తెలుగు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది కానీ దీనిపై ఏ మాత్రం బజ్ లేదు. మరోవైపు పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్', అలానే లేటెస్ట్ మలయాళ సెన్సేషన్ 'వాలా 2' కూడా తెలుగు డబ్బింగ్ రూపంలో ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మాజీ సీఎం మనవరాలు)
మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం దాదాపు 19కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రతిఛాయ, బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం అనే తెలుగు చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. హ్యాపీరాజ్ మూవీ కూడా ఇదే వీకెండ్ వచ్చే అవకాశముంది. ఇంతకీ ఏ సినిమా ఏ రోజు ఓటీటీలోకి రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 20 నుంచి 26 వరకు)
హాట్‌స్టార్
బ్రూక్లిన్ నైన్ నైన్ (ఇంగ్లీష్ కామెడీ సిరీస్) - ఏప్రిల్ 20
ప్రతిఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 24
24 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24
నెట్‌ఫ్లిక్స్
రెజల్ మేనియా (స్పోర్ట్స్ సిరీస్) - ఏప్రిల్ 19
అన్ చూజన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 21
హల్క్ హోగన్: రియల్ అమెరిన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 22
స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 23
అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24
సన్ నెక్స్ట్
లేచింది మహిళా లోకం (తెలుగు సినిమా) - ఏప్రిల్ 22
జీ5
బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24
జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24
అమెజాన్ ప్రైమ్
ఫ్రమ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 20
కెవిన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 20
కిల్లింగ్ గ్రౌండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22
హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24
నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24
లయన్స్ గేట్ ప్లే
గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24
ఆపిల్ టీవీ ప్లస్
క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22
మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24
(ఇదీ చదవండి: యుద్ధాన్ని ముందే అంచనా వేసిన ధనుష్ సినిమా)


