సినిమా, రాజకీయ రంగానికి విడదీయలేని సంబంధముంది. నటీనటులుగా రాణించిన వాళ్లు చాలామంది ప్రస్తుతం పాలిటిక్స్‌లోనూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మనవరాలు కూడా నటిగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమైంది. ఆ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఎవరామె? ఏంటా సినిమా?
(ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ట్రాన్స్‌జెండర్ తమన్నా)
గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా చేస్తున్న ఆనందీ బెన్ పటేల్ మనవరాలు సంస్కృతి జయానా నటిగా పరచయమవుతోంది. మే 7న తెలుగులోనూ రిలీజ్ కాబోతున్న 'కృష్ణావతారం పార్ట్ 1'లో శ్రీ కృష్ణుని ప్రియురాలు సత్యభామ పాత్ర పోషించింది. ఈ చిత్రంలో కృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా, రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసిని కృష్ణన్ నటించారు. ఈ మూవీ మొత్తం సత్యభామ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉండనుంది.

ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంస్కృతి జయానా.. ఇప్పటికే పారిశ్రామికవేత్తగా రాణిస్తోంది. లండన్, అమెరికాలోని ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ చేసిన ఈమె.. 16 ఏళ్ల వయసులోనే సొంత ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించింది. మరోవైపు తల్లిదండ్రులతో కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. మరి ఇప్పుడు సత్యభామ పాత్రలో నటిగా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: యుద్ధాన్ని ముందే అంచనా వేసిన ధనుష్ సినిమా)


