ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Vaazha 2 Movie OTT Release Date Update | Sakshi
Sakshi News home page

Vaazha 2 OTT: తెలుగులో రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి

May 1 2026 1:12 PM | Updated on May 1 2026 2:04 PM

Vaazha 2 Movie OTT Release Date Update

మలయాళ సినిమాలకు తెలుగులోనూ బోలెడంత క్రేజ్ ఉంది. ఓటీటీల్లోకి రావడం లేటు చూసేస్తుంటారు. రీసెంట్ టైంలో 'సంభవం అధ్యాయం ఒన్ను' చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇలానే అదరగొట్టేందుకు మరో మూవీ రెడీ అయిపోయింది. గతవారం తెలుగులోనూ విడుదలైన ఓ స్కూల్ ఏజ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ గురించి ఇప్పుడు అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: సత్య 'జెట్‌లీ' సినిమా రివ్యూ)

2024లో థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న 'వాలా' చిత్రానికి కొనసాగింపుగా.. 'వాలా 2' తీశారు. ఇన్ స్టాలో పాపులర్ అయిన కుర్రాళ్లు నలుగురిని లీడ్ రోల్స్‌గా పెట్టారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.200 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది.

ఏప్రిల్ 2న మలయాళంలో రిలీజ్ కాగా.. ఏప్రిల్ 26న తెలుగులో విడుదలైంది. ఇప్పుడు వచ్చే శుక్రవారం(మే 08) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది. కామెడీ, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని మిస్ అవ్వొద్దు.

'వాలా 2' విషయానికొస్తే.. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలకు చెందిన హాషిర్, అల‌న్‌, అజిన్‌, వినాయ‌క్ అనే న‌లుగురు కుర్రాళ్లని త‌ల్లిదండ్రులు ఎన్నోక‌ష్టాలు ప‌డుతూ కాలేజీకి పంపుతుంటారు. కానీ వీళ్లు చ‌దువుల్లో కంటే గొడ‌వ‌ల్లోనే ముందుంటారు. గొడ‌వ‌ల వల్ల ఓ ద‌శ‌లో కాలేజీ నుంచి బ‌య‌ట‌కు పంపించే ప‌రిస్థితులు వస్తాయి. ఓ పోలీస్ ఆఫీస‌ర్ (ఆల్ఫోన్స్ పుత్రన్‌) క‌ల‌గ‌జేసుకుని వీళ్ల‌ని కాపాడ‌తాడు. ఆ త‌ర్వాత ప‌రీక్ష‌లు రాసే అవ‌కాశం వ‌స్తుంది. ఉన్న‌త చ‌దువుల కోసం, ఉపాధి కోసం యూకే వెళ్లాల‌నుకున్న ఈ న‌లుగురూ త‌మ క‌ల‌ని నిజం చేసుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement