తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడనే విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇతడి చివరి సినిమాకు కష్టాలు మాత్రం తప్పట్లేదు. నాలుగు నెలల క్రితమే రిలీజ్ కావాల్సిన మూవీ.. సెన్సార్ సమస్యలతో అలా ఉండిపోయింది. కొన్నిరోజుల క్రితం లీక్ కావడం సంచలనం రేపింది. ఇప్పుడు 'జన నాయగణ్'కి మరో కష్టం వచ్చిపడింది.
(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)
లెక్క ప్రకారం జనవరి 9న విజయ్ 'జన నాయగణ్' సినిమాని థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో రెండు మూడు వారాలు ఆలస్యంగా తీసుకొస్తారులే అని అంతా భావించారు. కానీ నెలలు గడుస్తున్నా రాకపోవడంతో సగటు ప్రేక్షకుడి ఈ మూవీపై ఆసక్తి సన్నగిల్లుతూ వస్తోంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్‌కి కూడా ఆసక్తి పోయినట్లు ఉంది. అందుకే రూ.120 కోట్ల డీల్ నుంచి తప్పుకొన్నట్లు వార్తలొస్తున్నాయి.
అమెజాన్ సంస్థ తప్పుకోవడంతో రేసులోకి వచ్చిన జీ5 సంస్థ.. రూ.50 కోట్ల ఆఫర్ చేసిందట. ఒకవేళ దీనికి టీమ్ ఒప్పుకొంటే రూ.70 కోట్ల నష్టానికి అమ్ముకున్నట్లే అవుతుంది. చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ లీకై, థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని మూవీ విషయంలో అమెజాన్ రిస్క్ చేయలేకపోతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది.
తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రాన్ని రీమేక్ చేసే 'జన నాయగణ్' తీశారు. కాకపోతే విజయ్ రాజకీయ అవసరాలకు తగ్గట్లు పొలిటికల్ డైలాగ్స్, ఎపిసోడ్స్ పెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. కెవిఎన్ నిర్మాణ సంస్థపై వెంకట్ కె నారాయణ నిర్మించారు. ఈ చిత్రం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన.. 'టాక్సిక్' కూడా రిలీజ్ కాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.
(ఇదీ చదవండి: తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా?)


