మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు! | Varanasi Movie Water Crisis Latest Details | Sakshi
Sakshi News home page

Varanasi Movie: మహేశ్-రాజమౌళి సినిమా.. ఇలా జరిగిందేంటి?

May 3 2026 8:53 PM | Updated on May 3 2026 8:53 PM

Varanasi Movie Water Crisis Latest Details

మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'వారణాసి'. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే మూవీ టీమ్‌కి ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. చాలామందికి ఉన్నట్లే 'వారణాసి' బృందానికి కూడా నీటి కష్టాలు ఎదురయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

(ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)

మే 18 నుంచి హైదరాబాద్‌లోని గగన్‌పహాడ్ ఏరియాలో వేసిన సెట్‌లో నీటి అడుగున సన్నివేశాలు తీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. శుద్ధి చేసిన నీరు భారీ మొత్తంలో అవసరముంది. దీంతో 10,000 లీటర్ల కెపాసిటీ ఉన్న 150 ట్యాంకర్ల నీరు కావాలని మూవీ టీమ్.. హైదరాబాద్ వాటర్ బోర్డుకి ధరఖాస్తు చేసినట్లు సంబంధిత లెటర్ ఒకటి వైరల్ అవుతోంది.

అయితే 'వారణాసి' టీమ్ రిక్వెస్ట్‌ని హైదరాబాద్ వాటర్ బోర్డ్ తిరస్కరించిందట. నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, వివిధ ప్రాంతాల నుంచి నీటి డిమాండ్ పెరగడంతోనే.. నిర్మాతలకు వాటర్ ట్యాంకర్లు పంపించలేమని బోర్డ్ బదులిచ్చిందట. దీంతో నీటి కష్టాలు ఏర్పడ్డాయి. అయితే దీనికి వేరే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లేదంటే వేసవి పూర్తయిన తర్వాత షూటింగ్ చేస్తారా అనేది చూడాలి? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

షూటింగ్‌కి బ్రేక్ దొరకడంతో ఈ మధ్యే జర్మనీ వెళ్లిన మహేశ్ బాబు.. బ్లాక్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ నీటి కష్టాల వల్ల వాయిదా లాంటివి జరగవుగా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఫేమ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఇంట్లో విషాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement