సమంత ఒకప్పుడు స్టార్ హీరోయినే కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంతలా అంటే ఈమె సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతుందనే సంగతే జనాలకు తెలియనంతగా! కొన్నిరోజుల క్రితం కమెడియన్ వెన్నెల కిశోర్‌తో ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ చేశారు గానీ అదేం వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. తీరా కట్ చేస్తే 'పెద్ది' వల్ల ఏర్పడిన కన్ఫ్యూజన్ దెబ్బకు సమంత సినిమా ఏకంగా రెండు నెలలు వాయిదా పడిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య)
చివరగా విజయ్ దేవరకొండ 'ఖుషి'లో హీరోయిన్‌గా కనిపించిన సమంత.. తర్వాత ఓ వెబ్ సిరీస్ చేసింది గానీ సక్సెస్ అందుకోలేకపోయింది. గతేడాది రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి మరోసారి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ వేసవిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్లే మే 15న వస్తుందని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు.
మరి ఏమైందో ఏమో జూన్ తొలివారానికి వాయిదా పడే అవకాశముందనే రూమర్స్ వచ్చాయి. ఇంతలో 'పెద్ది'.. జూన్ 4 అనేసరికి 'మా ఇంటి బంగారం' ఆలోచనలో పడింది. ఇప్పుడు మే, జూన్ కాదు ఏకంగా జూలైకి వాయిదా వేశారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమో కాదో రాబోయే కొన్నిరోజుల్లో క్లారిటీ వస్తుంది.
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత.. గృహిణి పాత్ర చేసింది. కానీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది. అయితే ఔట్‌పుట్ అంతా సిద్ధమైన వాయిదా వేయడం, అది కూడా రెండు నెలలు పాటు అనేది కాస్త చిత్రంగా అనిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీపై ఉన్న హైప్ కూడా తగ్గిపోయే ప్రమాదముంది. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: రజనీ సినిమాలో చిరంజీవి భార్య.. భర్తని తలుచుకుని ఎమోషనల్)


