అరుదైన దృశ్యం.. ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య..! | Tollywood Actors Samantha And Naga Chaitanya Couples Attend Same Reception Post Separation, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Samantha -Naga chaitanya: అరుదైన దృశ్యం.. రిసెప్షన్‌ వేడుకలో సమంత, నాగచైతన్య..!

May 3 2026 10:24 AM | Updated on May 3 2026 11:31 AM

tollywood actors Samantha and naga chaitanya at reception evene goes viral

నాగచైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ‘వృషకర్మ’. ఇందులో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ చిత్రానికి   విరూపాక్ష’ఫేం కార్తిక్‌ దండు దర్శకత్వం వహిస్తున్నారు. నెల రోజుల క్రితమే వృషకర్మ’ గ్లింప్స్‌ రిలీజ్‌ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య  కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక సినిమా సంగతి పక్కన పెడితే టాలీవుడ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గతంలో విడిపోయిన నాగచైతన్య, సమంత ఓకే వేడుకలో మెరిశారు. చైతూ తన భార్య శోభిత ధూళిపాళ్లతో పెళ్లి రిసెప్షన్‌ వేడుకలో సందడి చేశారు. ఇదే రిసెప్షన్‌కు సమంత సైతం తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హాజరైంది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరిద్దరు ప్రముఖ నిర్మాత, ఏషియన్ సునీల్ కూతురు సిమ్రాన్ పెళ్లి రిసెప్షన్ హాజరు కావడం విశేషం.

వీరిద్దరు విడిపోయి పెళ్లిళ్లు చేసుకున్నాక ఓ వేడుకలో కనిపించడం ఇదే మొదటిసారి. అందుకే ఒక్కసారిగా అందరి కళ్లు వీరిద్దరిపైనే పడ్డాయి. ఇదే రిసెప్షన్‌లో నాగార్జున, అమల సైతం కనిపించారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement