రజనీ సినిమాలో చిరంజీవి భార్య.. భర్తని తలుచుకుని ఎమోషనల్ | Meghana Raj Gets Emotional On Wedding Anniversary, Reveals Role In Rajinikanth Jailer 2 Movie, Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

Meghana Rajinikanth: భార్య ద్వారా తీరిన భర్త చిరకాల కోరిక

May 3 2026 4:05 PM | Updated on May 3 2026 5:22 PM

Megha Sarja Acts With Rajinikanth Jailer 2 Movie

కొన్నేళ్ల క్రితం మరణించిన కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘన.. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తని తలుచుకుని భావోద్వేగానికి గురైంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఈమె, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'జైలర్ 2' సినిమాలో నటించిన సంగతి బయటపెట్టింది. అలానే భర్త చిరంజీవికి సంబంధించిన జ్ఞాపకాలని పంచుకుంది.

(ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య)

'ఈ రోజు ఒక తేదీ మాత్రమే కాదు మనద్దరి డ్రీమ్ ఒక్కటైన రోజు. నా ప్రతి అడుగులోనూ నిన్ను ఫీలవుతున్నాను. నువ్వు ఆయనని(రజనీకాంత్) ఆరాధించావు. నీ కోరిక వల్లే ఆయనని నేను కలిశాను. ఇది అసలు నేను కలలో కూడా ఊహించని విషయం. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం 'జైలర్ 2'లో లభించింది. మనం సాధించాం. నా భర్తకే ఈ సినిమా అంకితం చేస్తున్నాను. ఈ సక్సెస్ అంతా అతడికే చెందుతుంది' అని మేఘనా సర్జా భావోద్వేంగా రాసుకొచ్చింది.

రజనీతో దిగిన ఫొటోలోని పంచుకున్న మేఘనా సర్జా.. తన భర్తకు ఎంతో ఇష్టమైన భాషా బొమ్మపై స్వయంగా రజనీతో సంతకం కూడా చేయించింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లరి నరేశ్ 'బెండు అప్పారావు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మేఘనా.. తర్వాత కన్నడ, మలయాళ మూవీస్ చేస్తూ వచ్చింది. అలా హీరో చిరంజీవి సర్జాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ భర్త చనిపోయిన తర్వాత అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. మరి 'జైలర్ 2'లో ఈమె ఎలాంటి పాత్ర పోషించింది? ఏ మేరకు ఈమెకు గుర్తింపు తీసుకొస్తుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఆ కెపాసిటీ నాకు లేదు.. అందుకే రజనీకాంత్ సినిమా నుంచి తప్పుకున్నా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement